Smartphones Under 15000 : రూ.15,000లోపు ధరలో కిర్రాక్ ఫీచర్లతో వచ్చే 5జీ స్మార్ట్ ఫోన్స్.. లిస్ట్ ఓసారి చూసేయండి
Smartphones Under 15000 Rupees : కొత్త సంవత్సరంలో రూ.15,000లోపు విలువైన ధరలో 5జీ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీ కోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందులో కొన్నింటి గురించి చూసేయండి.
(1 / 6)
కొత్త సంవత్సరంలో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తే.. మీ కోసం కొన్ని ఫోన్లు ఉన్నాయి. రూ .15,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్న 5 స్మార్ట్ ఫోన్ల గురించి చూద్దాం.. ఇవి మంచి డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీలతో వస్తాయి.
(2 / 6)
టెక్నో పోవా 6 నియో 5జీ : ఈ ఫోన్ రూ.15,000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ రూ.12,998కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.67 అంగుళాల డిస్ ప్లేతో వస్తుంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో వస్తుంది. 108 మెగాపిక్సెల్ కెమెరా, ఏఐ ఫీచర్లు ఉన్నాయి.
(3 / 6)
రియల్ మీ 14ఎక్స్ 5జీ : రియల్ మీ 14ఎక్స్ 5జీ 6జీబీ ర్యామ్ , 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. బ్యాంక్ డిస్కౌంట్ కూడా రూ.1,000. ఇందులో 6.67 అంగుళాల 120హెడ్జ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, ఎస్ జీఎస్ మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
(4 / 6)
ఒప్పో కె12 ఎక్స్ 5జీ : ఒప్పో మిడ్ బడ్జెట్ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్షన్ 6300 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ లో 32 మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ లో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12999గా ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది.
(5 / 6)
లావా బ్లేజ్ డూ : ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.16,999కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే లభిస్తుంది. ఇది 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 2 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. 33 వాట్ ఛార్జింగ్ తో వస్తుంది. ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.
ఇతర గ్యాలరీలు