Smartphones Launched This Week: ఈ వారంలో లాంచ్ అయిన మొబైల్స్ ఇవే.. రియల్‍మీ 10 ప్రో 5జీ సిరీస్ నుంచి ఐకూ 11 వరకు..-smartphones launched this week from realme 10 pro to iqoo 11 series ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Smartphones Launched This Week: ఈ వారంలో లాంచ్ అయిన మొబైల్స్ ఇవే.. రియల్‍మీ 10 ప్రో 5జీ సిరీస్ నుంచి ఐకూ 11 వరకు..

Smartphones Launched This Week: ఈ వారంలో లాంచ్ అయిన మొబైల్స్ ఇవే.. రియల్‍మీ 10 ప్రో 5జీ సిరీస్ నుంచి ఐకూ 11 వరకు..

Dec 11, 2022, 05:28 PM IST Chatakonda Krishna Prakash
Dec 11, 2022, 05:28 PM , IST

Smartphones Launched This Week: ఈ వారంలో కొన్ని ఆసక్తికరమైన మొబైల్స్ లాంచ్ అయ్యాయి. ఇండియాలో రియల్‍మీ 10 ప్రో 5జీ సిరీస్ (Realme 10 Pro 5G Series) అడుగుపెట్టింది. చైనాలోనూ ఐకూ 11 సిరీస్ లాంచ్ అయింది. ఈ ఐకూ 11, ఐకూ 11 ప్రో ఫోన్లు వచ్చే నెల భారత్‍కు రానున్నాయి. ఒప్పో రెనో 8 ప్రోలో ప్రత్యేక ఎడిషన్ అందుబాటులోకి వచ్చింది. ఇలా ఈ వారంలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్లు ఏవో ఇక్కడ చూడండి.

రియల్‍మీ 10 ప్రో 5జీ సిరీస్ ఇండియాలో ఈ వారమే లాంచ్ అయింది. రియల్‍మీ 10 ప్రో 5జీ ప్రారంభ ధర రూ.18,999గా ఉంది. రియల్‍మీ 10 ప్రో+ 5జీ ప్రారంభ ధరను రూ.24,999గా రియల్‍మీ నిర్ణయించింది. 6.72 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఎల్‍సీడీ డిస్‍ప్లేతో రియల్‍మీ 10 ప్రో 5జీ వస్తోంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 

(1 / 7)

(Realme)

రియల్‍మీ 10 ప్రో+ 5జీ ఫోన్ 120Hz సూపర్ అమోలెడ్ కర్వ్డ్ డిస్‍‍ప్లేను కలిగి ఉంది. 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. డైమన్సిటీ 1080 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 

(2 / 7)

(Priya/HT Tech)

బడ్జెట్ రేంజ్‍లో సామ్‍సంగ్ గెలాక్సీ ఎం04 మొబైల్ ఇండియాలో లాంచ్ అయింది. వర్చువల్‍గా ర్యామ్‍ను పొడిగించుకునే ర్యామ్ ప్లస్ ఫీచర్ ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ ధర రూ.8,499గా ఉంది. ఈనెల 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‍లో ఈ ఫోన్ సేల్‍కు వస్తుంది. 

(3 / 7)

(Samsung)

ఐకూ 11 సిరీస్ చైనాలో లాంచ్ అయింది. ఈ సిరీస్‍లో ఐకూ 11, ఐకూ 11 ప్రో అడుగుపెట్టాయి. ఈ ఫోన్‍లు ఇండియాలో జనవరిలో లాంచ్ కానున్నాయి. ఐకూ నియో 7 ఎస్ఈ కూడా చైనాలో విడుదలైంది. 

(4 / 7)

(iQOO)

200వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో ఐకూ 11 ప్రో వస్తోంది. ఈ ఫోన్ వెనుక 50MP+50MP+13MP కెమెరాలు ఉంటాయి. ఐకూ 11 ఫోన్ 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే 6.78 ఇంచుల 2కే అమోలెడ్ డిస్‍ప్లేలు, స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ లను ఈ ఫోన్‍లు కలిగి ఉంటాయి. 

(5 / 7)

(iQOO )

టెక్నో ఫాంటమ్ ఎక్స్2, టెక్నో ఫాంటమ్ ఎక్స్2 ప్రో మొబైళ్లు ఈవారంలోనే దుబాయ్‍లో లాంచ్ అయ్యాయి. ఇండియాలో ఈనెలాఖరులో విడుదవుతాయి. 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే కర్వ్డ్ అమోలెడ్ డిస్‍ప్లేలను ఈ ఫోన్లు కలిగి ఉన్నాయి. ఈ మొబైళ్ల వెనుక కెమెరా సెటప్ చాలా డిఫరెంట్‍గా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఎక్స్2 ప్రో వెనుక 50MP+50MP+13MP కెమెరాలు ఉంటాయి. ఎక్స్2 మొబైల్ వెనుక 64MP+13MP+2MP కెమెరాలను పొందుపరిచింది టెక్నో. 

(6 / 7)

(Tecno )

రెనో 8 ప్రో మొబైల్‍కు హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లిమిటెడ్ ఎడిషన్‍ను ఒప్పో తీసుకొచ్చింది. డ్రాగన్ స్కిన్ లాంటి లెదర్ తో ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ ఉంటుంది. ఇంటర్ఫేస్‍లోనూ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ థీమ్స్ ఉంటాయి. కొన్ని యాక్ససరీలు కూడా వస్తాయి. అయితే మిగిలిన స్పెసిఫికేషన్లన్నీ రెనో 8 ప్రోను పోలే ఉంటాయి. ఈ ఒప్పో రెనో 8 ప్రో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ స్పెషల్ ఎడిషన్ ధర రూ.45,999గా ఉంది. 

(7 / 7)

(Oppo )

WhatsApp channel

ఇతర గ్యాలరీలు