ఏపీ రేషన్ కార్డుదారులకు అలర్ట్ - ఈ 2 తప్పులుంటే కార్డు కట్..! స్మార్ట్ కార్డు కూడా రాదు...-smart ration card will be cancelled if ekyc is not done ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఏపీ రేషన్ కార్డుదారులకు అలర్ట్ - ఈ 2 తప్పులుంటే కార్డు కట్..! స్మార్ట్ కార్డు కూడా రాదు...

ఏపీ రేషన్ కార్డుదారులకు అలర్ట్ - ఈ 2 తప్పులుంటే కార్డు కట్..! స్మార్ట్ కార్డు కూడా రాదు...

Published Oct 07, 2025 10:47 AM IST Maheshwaram Mahendra Chary
Published Oct 07, 2025 10:47 AM IST

ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది. అయితే ఈకేవైసీ లేని కార్డులను పక్కన పెట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎప్పటికప్పుడు రేషన్ పంపిణీ కేంద్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. పలు జిల్లాల్లో ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది.

(1 / 8)

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది. అయితే కొత్త కార్డుల పంపిణీ తర్వాత ప్రభుత్వం ఓ ప్రకటన కూడా చేసింది. వరుసగా 3 నెలల పాటు రేషన్ తీసుకోకపోతే కార్డును రద్దు చేస్తామని తెలిపింది.

(2 / 8)

రేషన్ తీసుకోవాలంటే ఈకేవైసీ ప్రాసెస్ తప్పనిసరిగా పూర్తి అయి ఉండాలి. లేకపోతే సరుకులను పంపిణీ చేయరు. అయితే ఇప్పటివరకు కూడా కొందరు ఈకేవైసీ పూర్తి చేసుకోలేదు. దీంతో వీరి వివరాలను సేకరించిన అధికారులు… స్మార్ట్ రేషన్ కార్డులను కూడా నిలిపివేయనున్నారు.

(3 / 8)

ఇలాంటి వారి వివరాలను పౌరసరఫరాల శాఖ ఎప్పటికప్పుడు సేకరిస్తోంది. వీరిని అనర్హులుగా గుర్తించే పనిలో పడింది. స్మార్ట్‌ కార్డులు సైతం నిలిపివేయగా… కార్డులను కూాడా రద్దు చేసే పనిలో పడ్డారు.

(4 / 8)

అనర్హులను గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈకేవైసీ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా కొత్త కార్డుల్లో కూడా ఎవరైనా అనర్హులు ఉంటే వారి పేర్లను తొలగించనున్నారు.

(5 / 8)

కాబట్టి ఈకేవైసీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా… 3 నెలలుగా రేషన్ తీసుకోకుండా ఉండొద్దు, ఈ 2 విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే కార్డు రద్దవుతోంది. ఇకఈకేవైసీ స్టేట‌స్‌ను ఆన్‌లైన్‌లోనే సొంతంగానే తెలుసుకోవ‌చ్చు. రేష‌న్ డీల‌ర్‌, ఎండీయూ వాహ‌నంలో ఈపోస్ యంత్రంలో మీ రేష‌న్ కార్డు వివరాలు న‌మోదు చేస్తే స‌భ్యుల వివ‌రాల‌న్నీ వ‌స్తాయి. ఎరుపు రంగు గ‌డియ‌లో పేర్లు ఉంటే ఈకేవైసీ అప్‌డేట్ కాన‌ట్లే. అదే ఆకుప‌చ్చ రంగులో ఉంటే వారిది ఈకేవైసీ పూర్తి అయిన‌ట్లే. ఎరుపు రంగు గ‌డిలో పేరు ఉన్న‌వారు వేలిముద్ర వేస్తే వారి ఈకేవైసీ పూర్తి అవుతుంది.

(6 / 8)

కాబట్టి ఈకేవైసీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా… 3 నెలలుగా రేషన్ తీసుకోకుండా ఉండొద్దు, ఈ 2 విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే కార్డు రద్దవుతోంది. ఇక

ఈకేవైసీ స్టేట‌స్‌ను ఆన్‌లైన్‌లోనే సొంతంగానే తెలుసుకోవ‌చ్చు. రేష‌న్ డీల‌ర్‌, ఎండీయూ వాహ‌నంలో ఈపోస్ యంత్రంలో మీ రేష‌న్ కార్డు వివరాలు న‌మోదు చేస్తే స‌భ్యుల వివ‌రాల‌న్నీ వ‌స్తాయి. ఎరుపు రంగు గ‌డియ‌లో పేర్లు ఉంటే ఈకేవైసీ అప్‌డేట్ కాన‌ట్లే. అదే ఆకుప‌చ్చ రంగులో ఉంటే వారిది ఈకేవైసీ పూర్తి అయిన‌ట్లే. ఎరుపు రంగు గ‌డిలో పేరు ఉన్న‌వారు వేలిముద్ర వేస్తే వారి ఈకేవైసీ పూర్తి అవుతుంది.

ఆన్‌లైన్‌లో ఈకేవైసీ స్టేట‌స్‌ను చెక్ చేయాలంటే.. epds.ap.gov.in అని టైప్ చేసి ఎంట‌ర్ కొట్టాలి. అప్పుడు డిపార్ట్‌మెంట్ ఆఫ్ క‌న్స్యూమ‌ర్ అఫైర్స్‌, ఫుడ్ అండ్ సివిల్ స‌ప్లైస్‌ ఏపీ అనే వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో ఈపీడీఎస్ అని ఉంటుంది. దానిలో రేష‌న్ కార్డు విభాగంలో ఆరు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. అందులో "epds application search", "rice card search" అని ఉంటాయి. ఆ రెండింటిలో ఒక అప్ష‌న్‌ను క్లిక్ చేయాలి.

(7 / 8)

అందులో రేష‌న్ కార్డు నెంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి. అప్పుడు రేష‌న్ కార్డులోని ల‌బ్ధిదారుల పేర్లు వ‌స్తాయి. అందులో పేర్ల ఎదురుగా చివ‌రిలో ఎస్ అని ఉంటే ఈకేవైసీ అయిన‌ట్లు, నో అని ఉంటే ఈకేవైసీ కాన‌ట్లు. ఈకేవైసీ కాక‌పోతే వేలిముద్ర వేస్తే ఈకేవైసీ అవుతుంది.

(8 / 8)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు