Smelly Fridge: ఫ్రిజ్ తలుపు తెరవగానే చెడువాసన వస్తోందా? ఈ చిట్కాలతో దుర్వాసన మాయం!-smart hacks to remove bad smell from your fridge ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Smart Hacks To Remove Bad Smell From Your Fridge

Smelly Fridge: ఫ్రిజ్ తలుపు తెరవగానే చెడువాసన వస్తోందా? ఈ చిట్కాలతో దుర్వాసన మాయం!

Jul 13, 2023, 06:37 PM IST HT Telugu Desk
Jul 13, 2023, 06:37 PM , IST

  • remove bad smell from your fridge: ఫ్రిజ్‌లో మనం అనేక ఆహార పదార్థాలను చాలా కాలం పాటు నిల్వచేస్తాం. ఇవి ఫ్రిజ్‌లో చెడు వాసనను కలిగించడానికి కారణం అవుతాయి, ఈ వాసన పోగొట్టేందుకు కొన్ని టిప్స్ ఇక్కడ చూడండి.

ఈరోజుల్లో దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఫ్రిజ్ ఉంటుంది. ఇది కూడా మన జీవితంలో ఒక భాగంగా మారింది. మనం అనేక ఆహార పదార్థాలను కూరగాయలను, పండ్లను, పచ్చళ్లను చాలా కాలం పాటు రిఫ్రిజిరేటర్‌లో  నిల్వచేస్తాం. ఇవి ఫ్రిజ్‌లో చెడు వాసనను కలిగించడానికి కారణం అవుతాయి, ఈ వాసన పోగొట్టేందుకు కొన్ని టిప్స్ ఇప్పుడు చూద్దాం.   

(1 / 8)

ఫ్రిజ్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి, కుళ్లిపోయిన పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వచేస్తే అది లోపల దుర్వాసన కలిగిస్తుంది. ఆ వాసన అందులో అలాగే ఉండిపోతుంది. ఇది మనకు చికాకును కలిగిస్తుంది. 

(2 / 8)

ఓట్మీల్ ఫ్రిజ్‌లో చెడు వాసనను తొలగించగలదు.  వినడానికి ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ దుర్వాసనను వదిలించుకోవడానికి ఇది సులభమైన మార్గాలలో ఒకటి. ఓట్స్‌ను అల్యూమినియం గిన్నెలోకి తీసుకుని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఓట్స్ ఆ వాసనను గ్రహిస్తాయి. 

(3 / 8)

బొగ్గు ఒక మంచి డియోడరైజర్. ఒక గిన్నెనిండా బొగ్గులను తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టండి. రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతను కనిష్టానికి తగ్గించండి. కొన్ని గంటల తర్వాత, ఫ్రిజ్ తెరిచి వాసన పోతుంది. 

(4 / 8)

రిఫ్రిజిరేటర్ లో వాసనను తొలగించడానికి ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఉపయోగపడుతుంది. కొన్ని కాటన్ బాల్స్‌ను ఎసెన్షియల్ ఆయిల్‌లో నానబెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. కొన్ని గంటల తర్వాత ఫ్రిజ్ డోర్ తెరవండి, చెడువాసన పోయి మంచి వాసన ఉంటుంది. అయితే  అయితే ఎసెన్షియల్ ఆయిల్ ఉపయోగిస్తున్నప్పుడు ఫ్రిజ్‌లో ఎలాంటి ఆహార పదార్థాలు ఉంచకుండా జాగ్రత్త పడండి. 

(5 / 8)

ఫ్రిజ్‌లోని చెడు వాసనను వదిలించుకోవడానికి వెనిగర్ కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఒక గిన్నె లేదా కప్పులో వైట్ వెనిగర్ తీసుకొని రిఫ్రిజిరేటర్‌లో కొన్ని గంటల తర్వాత ఫ్రిజ్ తెరిచి చూడండి, వాసన పూర్తిగా పోతుంది! 

(6 / 8)

కొన్ని నిమ్మకాయ ముక్కలను ఫ్రిజ్ లోపల ఉంచండి. నిమ్మకాయ మీ ఫ్రిజ్ లోని చెడువాసనను గ్రహిస్తుంది.  తాజా వాసనను ఏర్పరుస్తుంది. 

(7 / 8)

ఏదైనా వాసనను తొలగించడానికి బేకింగ్ సోడా సరైనది. ఒక గిన్నెలో బేకింగ్ సోడా నింపి ఫ్రిజ్ లోపల ఉంచండి. కొన్ని గంటల తర్వాత వాసన పూర్తిగా పోతుంది. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు