Simple One: ఇండియాలో లాంగెస్ట్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే: ఫొటోలతో పాటు వివరాలు
- Simple One Electric Scooter: సింపుల్ ఎనర్జీ సంస్థ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. రూ.1.45లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో సింపుల్ వన్ (Simple One) ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయింది. ఇండియాలో ప్రస్తుతం ఇదే అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అని సింపుల్ ఎనర్జీ పేర్కొంది. వివరాలివే.

(1 / 5)
ఇండియా లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సింపుల్ ఎనర్జీ లాంచ్ చేసింది. ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఇస్తుంది. ప్రస్తుతం దేశంలో ఇదే అత్యధిక రేంజ్ ఇచ్చే స్కూటర్‌గా ఉంది. (Simple)
(2 / 5)
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో వచ్చింది. స్టాండర్డ్ ఆన్-బోర్డ్ చార్జర్ వేరియంట్ ధర రూ.1.45లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 750-వాట్ చార్జర్ వేరియంట్ రూ.1.58లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో వచ్చింది.(Simple)
(3 / 5)
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 5 kWh బ్యాటరీ ఉంది. బ్యాటరీ రక్షణ కోసం బీఎంఎస్, ఐపీ57 రేటింగ్ ఉంటాయి. (Simple)
(4 / 5)
7 ఇంచుల స్మార్ట్ టచ్ డిస్‍ప్లేతో ఈ స్కూటర్ వచ్చింది. డార్క్, లైట్ మోడ్‍లో రైడర్ ఈ స్క్రీన్‍ను సెట్ చేసుకోవచ్చు. (Simple)
ఇతర గ్యాలరీలు