shubman gill: శుభ్ మన్ గిల్ వరల్డ్ రికార్డు.. ఫాస్టెస్ట్ క్రికెటర్..ఒకే స్టేడియంలో టెస్టు, వన్డే, టీ20, ఐపీఎల్ హండ్రెడ్
shubman gill: టీమ్ఇండియా యంగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ చరిత్ర క్రియేట్ చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డు అందుకున్నాడు. 50 వన్డేల్లోనే అతను ఈ ఫీట్ సాధించాడు.
(1 / 5)
భారత క్రికెట్ జట్టు యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ హిస్టరీ క్రియేట్ చేశాడు. వన్డేల్లో 2500 పరుగులు పూర్తిచేసిన ఫాస్టెస్ క్రికెటర్ గా నిలిచాడు. 50 వన్డే ఇన్నింగ్స్ ల్లో గిల్ ఈ ఘనత అందుకున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీం ఆమ్లా (53 ఇన్నింగ్స్) ను వెనక్కినెట్టి గిల్ వరల్డ్ రికార్డు అందుకున్నాడు.
(REUTERS)(2 / 5)
కెరీర్ ఆరంభం నుంచి వన్డేల్లో సెన్సేషనల్ ఫామ్ తో సాగుతున్న శుభ్ మన్ పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరన్నది పట్టించుకోకుండా నిలకడగా రాణిస్తున్నాడు. 25 ఏళ్ల గిల్ 50 వన్డేల్లో 60.16 సగటుతో 2587 పరుగులు చేశాడు.
(REUTERS)(3 / 5)
ఇంగ్లండ్ తో మూడో వన్డేలో సెంచరీతో శుభ్ మన్ గిల్ అదరగొట్టాడు. వన్డేల్లో అతనికిది ఏడో సెంచరీ. ఇంగ్లండ్ తో సిరీస్ లో మూడు మ్యాచ్ ల్లోనూ 50 కి పైగా పరుగులు చేసిన గిల్.. మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఈ ఘనత సాధించిన ఏడో భారత బ్యాటర్ గా నిలిచాడు.
(PTI)(4 / 5)
అహ్మదాబాద్ లో తాజాగా వన్డే సెంచరీ నమోదు చేసిన గిల్.. ఒకే స్టేడియంలో టెస్టు, వన్డే, టీ20, ఐపీఎల్ లో శతకాలు చేసిన ఏకైక బ్యాటర్ గా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో ఒకే స్టేడియంలో టెస్టు, వన్డే, టీ20ల్లో సెంచరీలు చేసిన అయిదో ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. డుప్లెసిస్, వార్నర్, బాబర్ అజాం,డికాక్ ముందున్నారు.
(PTI)ఇతర గ్యాలరీలు