
(1 / 5)
భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఐదు మ్యాచ్ లలో అతడు 754 పరుగులు చేశాడు. 75.40 యావరేజి ఉన్న అతడి బ్యాట్ నుంచి 4 సెంచరీలు వచ్చాయి.
(PTI)
(2 / 5)
జో రూట్ - ఇంగ్లండ్ స్టార్ జో రూట్ గత కొన్నేళ్లుగా టెస్టు క్రికెట్ లో చెలరేగుతున్నాడు. ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 5 మ్యాచ్ లు, 9 ఇన్నింగ్స్ లో మొత్తం 537 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సాధించాడు.
(HT_PRINT)
(3 / 5)
టీమిండియా తరఫున అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. 5 మ్యాచ్ లు 10 ఇన్నింగ్స్ లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో కలిపి మొత్తం 532 పరుగులు చేశాడు.
(PTI)
(4 / 5)
రవీంద్ర జడేజా - ఈ ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభమైనప్పుడు రవీంద్ర జడేజా 500కు పైగా పరుగులు చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు, కానీ అతను 516 పరుగులు సాధించి సిరీస్ లో నాలుగో స్థానంలో నిలిచాడు. జడేజా ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు.
(PTI)
(5 / 5)
హ్యారీ బ్రూక్ క్లాస్ చూపించాడు. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన వాళ్లలో ఐదో స్థానంలో నిలిచాడు. 5 మ్యాచ్ లలో 9 ఇన్నింగ్స్ లో 481 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 500 కంటే తక్కువ పరుగులు చేసిన టాప్ 5లో ఉన్న ఏకైక బ్యాట్స్ మన్ అతడే.
(AFP)ఇతర గ్యాలరీలు