
(1 / 5)
శుభ్‌మన్ గిల్ ఇంకో 53 పరుగులు చేస్తే భారత్ తరపున ఓ టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. గిల్ ప్రస్తుతం 722 పరుగులతో ఉన్నాడు. మరో 53 పరుగులు చేస్తే సునీల్ గవాస్కర్ రికార్డు (1971లో విండీస్ పై 774)ను దాటేస్తాడు.
(@BCCI X)
(2 / 5)
శుభ్‌మన్ గిల్ మరో 89 పరుగులు చేస్తే డాన్ బ్రాడ్ మన్ ను దాటి ప్రపంచ రికార్డు నమోదు చేస్తాడు. ఓ టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా రికార్డు (1936-37లో ఇంగ్లాండ్ లో 810) బ్రాడ్ మన్ పేరు మీదే ఉంది.
(@BCCI X)
(3 / 5)
శుభ్‌మన్ గిల్ మరో సెంచరీ చేస్తే ఓ టెస్టు సిరీస్ లో అత్యధిక శతకాలు బాదిన కెప్టెన్ గా నిలుస్తాడు. డాన్ బ్రాడ్ మన్ (1947లో ఇంగ్లాండ్ పై 4), సునీల్ గవాస్కర్ (1978లో వెస్టిండీస్ పై 4)ను దాటేస్తాడు.
(PTI)
(4 / 5)
ఈ సిరీస్ లో ఇప్పటివరకూ నాలుగు సెంచరీలు చేసిన శుభ్‌మన్ గిల్ మరో హండ్రెడ్ సాధిస్తే.. ఒకే సిరీస్ లో ఎక్కువ శతకాలు చేసిన బ్యాటర్ గా క్లెయిడ్ వాల్కోట్ సరసన నిలుస్తాడు. వాల్కోట్ 1955లో ఆస్ట్రేలియాపై అయిదు సెంచరీలు చేశాడు.
(PTI)
(5 / 5)
ఇంగ్లాండ్ తో లాస్ట్ టెస్టులో శుభ్‌మన్ గిల్ మరో 253 పరుగులు చేస్తే.. ఓ టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలుస్తాడు. డాన్ బ్రాడ్ మన్ (1930లో ఇంగ్లాండ్ పై 974)ను దాటేస్తాడు.
(PTI)ఇతర గ్యాలరీలు