డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. 45 ఏళ్ల కిందటి రికార్డు బ్రేక్.. కోహ్లి, సచిన్‌కూ సాధ్యం కాని రికార్డు-shubman gill double century first indian captain to score double hundred on england soil ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. 45 ఏళ్ల కిందటి రికార్డు బ్రేక్.. కోహ్లి, సచిన్‌కూ సాధ్యం కాని రికార్డు

డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. 45 ఏళ్ల కిందటి రికార్డు బ్రేక్.. కోహ్లి, సచిన్‌కూ సాధ్యం కాని రికార్డు

Published Jul 03, 2025 07:12 PM IST Hari Prasad S
Published Jul 03, 2025 07:12 PM IST

శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై గతంలో ఏ ఇండియన్ కెప్టెన్, ప్లేయర్ కూ సాధ్యం కాని రీతిలో డబుల్ సెంచరీ చేశాడు. ఎప్పుడో 35 ఏళ్ల కిందట మహ్మద్ అజారుద్దీన్ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాదు 45 ఏళ్ల కిందటి సునీల్ గవాస్కర్ రికార్డునూ బద్ధలు కొట్టాడు.

టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఇండియన్ టీమ్ కెప్టెన్ గా నిలిచాడు. రెండో టెస్ట్ రెండో రోజు తొలి ఇన్నింగ్స్ లో గిల్ 313 బంతుల్లో తన డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతనికిది తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం.

(1 / 6)

(BCCI X)

ఇంగ్లండ్ గడ్డపై ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ కెప్టెన్ గానే కాదు.. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గానూ నిలిచాడు. అతడు 222 స్కోరు చేరగానే అప్పటి వరకూ 221 పరుగులతో సునీల్ గవాస్కర్ (1979లో..) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. మూడో స్థానంలో 217 పరుగులతో ద్రవిడ్ ఉన్నాడు.

(2 / 6)

(AP)

ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు క్రికెట్లో 150కి పైగా పరుగులు చేసిన తొలి భారత కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్. 1990లో మాంచెస్టర్లో 179 పరుగులు చేశాడు. ఇప్పుడా రికార్డునే గిల్ అధిగమించాడు.

(3 / 6)

2018లో బర్మింగ్‌హామ్ లో విరాట్ కోహ్లీ 149 పరుగులు చేశాడు. అతడు ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

(4 / 6)

ఇక మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇంగ్లాండ్ లో భారత్ టెస్ట్ సిరీస్ ఆడిన వ్యక్తి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కెప్టెన్ గా 1967లో ఇంగ్లాండ్ లోని లీడ్స్ లో 148 పరుగులు చేశాడు. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ 1990 వరకు మొదటి స్థానంలో ఉన్నాడు.

(5 / 6)

(Getty Image)

ఐదో స్థానంలోనూ శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. కెప్టెన్ గా తన తొలి టెస్టులోనే అతడు సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో గిల్ 147 రన్స్ చేశాడు.

(6 / 6)

(AFP)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు