
(1 / 5)
Shubman Gill No.1: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం రోజే టీమిండియా స్టార్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకు అందుకున్నాడు. ఐసీసీ బుధవారం (ఫిబ్రవరి 19) రిలీజ్ చేసిన ర్యాంకుల్లో బాబర్ ఆజంను వెనక్కి నెట్టాడు. బాబర్ రెండోస్థానానికి పడిపోయాడు.

(2 / 5)
Shubman Gill No.1: ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లలో 87, 60 రన్స్ చేసిన గిల్.. తాజా ర్యాంకుల్లో పైకి దూసుకెళ్లాడు. బాబర్ రెండో స్థానానికి పోడిపోయాడు. అతని కంటే 23 రేటింగ్ పాయింట్ల ముందున్నాడు. ఈ మధ్యే న్యూజిలాండ్, సౌతాప్రికాతో జరిగిన ముక్కోణపు సిరీస్ లో బాబర్ ఆజం విఫలమవడంతో అతడు రెండో స్థానానికి పడిపోయాడు.

(3 / 5)
Shubman Gill No.1: తాజా ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో ర్యాంకులోనే కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ తో సిరీస్ లో ఓ సెంచరీతో అతడు ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.
(Surjeet Yadav)
(4 / 5)
Shubman Gill No.1: వన్డే బౌలర్ల జాబితాలో శ్రీలంక బౌలర్ మహీష్ తీక్షణ అగ్రస్థానంలో నిలిచాడు. అతను ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్‌ను వెనుకకు నెట్టాడు. రషీద్ రెండవ స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 2 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తీక్షణ మొత్తం 4 వికెట్లు తీశాడు.

(5 / 5)
Shubman Gill No.1: బౌలర్ల ర్యాంకుల్లో టీమిండియాకు చెందిన కుల్దీప్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్లలో జడేజా పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
(AP)ఇతర గ్యాలరీలు