(1 / 5)
భారత క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ తో గిల్ పగ్గాలు చేపడతాడు. 25 ఏళ్ల 285 రోజుల వయసులో కెప్టెన్సీ చేపట్టనున్న గిల్.. అయిదో అతిపిన్న వయస్సు భారత సారథిగా నిలుస్తాడు.
(AFP)(2 / 5)
యంగెస్ట్ టీమిండియా టెస్టు కెప్టెన్ రికార్డు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పేరు మీద ఉంది. 21 ఏళ్ల 77 రోజుల వయసులో 1962 మార్చి 23న పటౌడీ కెప్టెన్సీ చేపట్టారు. అప్పుడు ప్రపంచంలోనే యంగెస్ట్ టెస్టు కెప్టెన్ పటౌడీ.
(x/CricketopiaCom)(3 / 5)
భారత అతి పిన్న వయస్సు టెస్టు కెప్టెన్ జాబితాలో సచిన్ టెండూల్కర్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. 1996 అక్టోబర్ 10న టెస్టు సారథిగా బాధ్యతలు చేపట్టే నాటికి సచిన్ వయసు 23 ఏళ్ల 169 రోజులు.
(x/cricketcomau)(4 / 5)
వన్డేల్లో ఇండియాకు ఫస్ట్ ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ కూడా యంగెస్ట్ ఇండియన్ టెస్టు కెప్టెన్ లిస్ట్ లో కొనసాగుతున్నాడు. కపిల్ 24 ఏళ్ల 48 రోజుల వయసులో టీమిండియా టెస్టు పగ్గాలు చేపట్టాడు. 1983 ఫిబ్రవరి 23న కపిల్ టెస్టు కెప్టెన్ అయ్యాడు.
(x/RCBTweets)(5 / 5)
రవి శాస్త్రి 25 ఏళ్ల 229 రోజుల వయసులో భారత టెస్టు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. 1988 జనవరి 11న రవి శాస్త్రి టీమిండియా టెస్టు కెప్టెన్ అయ్యాడు.
(x/RaviShastriOfc)ఇతర గ్యాలరీలు