Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్‍గా శుభ్‍మన్ గిల్: వివరాలివే
- Shubman Gill - Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ కోసం కెప్టెన్‍గా శుభ్‍మన్ గిల్‍ను నియమించింది గుజరాత్ టైటాన్స్ జట్టు. హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ టీమ్‍కు వెళ్లిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వివరాలివే..
- Shubman Gill - Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ కోసం కెప్టెన్‍గా శుభ్‍మన్ గిల్‍ను నియమించింది గుజరాత్ టైటాన్స్ జట్టు. హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ టీమ్‍కు వెళ్లిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వివరాలివే..
(1 / 6)
వచ్చే ఏడాది ఐపీఎల్ 2024 సీజన్‍లో గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు టీమిండియా యువ స్టార్ బ్యాటర్ శుభ్‍మన్ గిల్ కెప్టెన్సీ చేయనున్నాడు. ఈ విషయాన్ని జీటీ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.
(2 / 6)
2022, 2023 సీజన్లలో గుజరాత్ టైటాన్స్ టీమ్‍కు కెప్టెన్‍గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా.. ట్రేడ్ ద్వారా మళ్లీ ముంబై ఇండియన్స్ టీమ్‍కు వెళ్లాడు. దీంతో వచ్చే 2024 సీజన్‍కు గిల్‍ను కెప్టెన్‍గా నియమించింది గుజరాత్. (PTI)
(3 / 6)
2018లో కోల్‍కతా నైట్ రైడర్స్ జట్టుతో ఐపీఎల్‍లో శుభ్‍మన్ గిల్ అరంగేట్రం చేశాడు. 2022 సీజన్ కోసం జరిగిన వేలంలో గుజరాత్ టైటాన్స్ అతడిని రూ.7కోట్లకు సొంతం చేసుకుంది. (PTI)
(4 / 6)
ఐపీఎల్ 2022 సీజన్‍లో గుజరాత్ తరఫున బరిలోకి దిగిన శుభ్‍మన్ గిల్ 483 పరుగులు చేశాడు. ఫైనల్‍లో అజేయంగా 45 రన్స్ చేశాడు. గుజరాత్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఏడాది 2023 ఐపీఎల్‍లో గిల్ విశ్వరూపం చూపాడు. 17 ఇన్నింగ్స్ ల్లో ఏకంగా 890 రన్స్ చేశాడు. ఈ సీజన్‍లో గుజరాత్ ఫైనల్ వరకు చేరింది. తుదిపోరు చెన్నై చేతిలో ఓడి రన్నరప్‍గా నిలిచింది.(PTI)
(5 / 6)
2022 ఐపీఎల్‍లో హార్దిక్ సారథ్యంలో టైటిల్ సాధించిన గుజరాత్.. ఈ ఏడాది ఫైనల్ చేరింది. అయితే, ఇప్పుడు తన పాత టీమ్ ముంబైకి హార్దిక్ వెళ్లాడు. దీంతో హార్దిక్‍కు వీడ్కోలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది గుజరాత్. శుభ్‍మన్ గిల్‍ను కెప్టెన్ చేసింది. (PTI)
ఇతర గ్యాలరీలు