shri krishna janmashtami : శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున చేయాల్సిన, చేయకూడని పనులు
shri krishna janmashtami : శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు ఆచరించాల్సిన ప్రత్యేక పూజలు, చేయకూడని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని కచ్చితంగా ఫాలో అయితే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం అవేంటో చూద్దాం..
(1 / 6)
ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణపక్షం అష్టమి తిథి నాడు కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. ఆలయాలతోపాటుగా ఇళ్లలోనూ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
(2 / 6)
శ్రీకృష్ణ జన్మాష్టమిని శ్రీకృష్ణుని జననంగా జరుపుకొంటారు. కృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించారని చెబుతారు. ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి ఆగస్టు 26 న జరుపుకోనున్నారు. ఈ రోజుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
(3 / 6)
ఈ రోజున ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఉపవాసం పాటించాలి. ఉపవాసం మొదలయ్యే క్షణం నుంచి శ్రీకృష్ణుని నామాన్ని జపించాలి. జన్మాష్టమి నాడు అన్నం, బార్లీ పదార్థాలు తినకూడదు. జన్మాష్టమి నాడు వెల్లుల్లి, ఉల్లి, మసాలా పదార్థాలు తినకూడదు. ఈ రోజు మాంసం, మద్యానికి దూరంగా ఉండండి(Hindustan Times)
(4 / 6)
శ్రీకృష్ణుడిని విష్ణువు అవతారంగా భావిస్తారు. అయితే తులసి ఆకులను జన్మాష్టమి నాడు తీయకూడదు. ఎందుకంటే తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది. ఈ రోజున తులసిని పూజించండి, శ్రీ కృష్ణుడికి తులసి మంజరిని సమర్పించండి.
(5 / 6)
జన్మాష్టమి నాడు వెల్లుల్లి, ఉల్లి, మసాలా పదార్థాలు తినకూడదు. ఈ రోజు మాంసం, మద్యానికి దూరంగా ఉండండి.
ఇతర గ్యాలరీలు