(1 / 5)
ఆస్ట్రేలియా పేసర్ హేజిల్ వుడ్ తిరిగి ఐపీఎల్ 2025 సీజన్ కు రాకపోతే ఆర్సీబీకి గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశముంది. ఎందుకంటే ఈ సీజన్ లో హేజిల్ వుడ్ గొప్పగా రాణిస్తున్నాడు. 10 ఇన్నింగ్స్ ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇంజూరీ కారణంగా హేజిల్ వుడ్ మిగతా సీజన్ లో ఆడటం అనుమానమే.
(AP)(2 / 5)
ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా ఐపీఎల్ 2025లో అదరగొడుతున్నాడు. 11 ఇన్నింగ్స్ ల్లో 14 వికెట్లు సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ దిశగా సాగాలంటే స్టార్క్ కీలకం.
(REUTERS)(3 / 5)
ఐపీఎల్ 2025లో ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ టీమ్ ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఆ టీమ్ కెప్టెన్ కమిన్స్ తిరిగి వస్తాడనే వార్తలు వస్తున్నా. దీనిపై క్లారిటీ లేదు. మరోవైపు కమిన్స్ రాకపోవచ్చనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
(AFP)(4 / 5)
సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా మిగిలిన ఐపీఎల్ సీజన్ లో ఆడటం డౌటే. ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఈ సీజన్లో ఫెయిలవుతున్నాడు. 11 మ్యాచ్ ల్లో 281 పరుగులు మాత్రమే చేశాడు.
(PTI)(5 / 5)
ఐపీఎల్ 2025లో జోరుమీదున్న పంజాబ్ కింగ్స్ కు వికెట్ కీపర్ ఇంగ్లిస్ సేవలు అవసరం. మరి ఈ ఆటగాడు ఐపీఎల్ కు తిరిగొస్తాడో లేదో చూడాలి.
(REUTERS)ఇతర గ్యాలరీలు