Novak Djokovic: జకోవిచ్ టైం అయిపోయిందా? పాతిక గ్రాండ్ స్లామ్స్ కలేనా? ఓటములతో షాక్
Novak Djokovic: టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ టైం అయిపోయిందా? 25వ గ్రాండ్ స్లామ్ ట్రోఫీతో అత్యధిక టైటిళ్ల రికార్డు కల కలగానే మిగిలిపోనుందా? గాయాలు, బ్యాడ్ ఫామ్ జకోవిచ్ ను వెనక్కి లాగుతున్నాయి. తాజాగా ఖతార్ ఓపెన్ లో తొలి రౌండ్లోనే అతనికి షాక్ తగిలింది.
(1 / 5)
పురుషుల సింగిల్స్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచింది జకోవిచ్. ఓవరాల్ గా 24 టైటిళ్లతో మార్గరెట్ కోర్టుతో కలిసి అతను ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నాడు. మరో టైటిల్ గెలిస్తే ఒక్కడే నంబర్ వన్ అవుతాడు. కానీ గాయాలు, బ్యాడ్ ఫామ్ అతణ్ని వెనక్కి లాగుతున్నాయి.
(REUTERS)(2 / 5)
ఒకప్పుడు వరుస టైటిళ్లతో అదరగొట్టిన 37 ఏళ్ల జకోవిచ్ ఇప్పుడు ఓటములు ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఖతార్ ఓపెన్ లో అతను 6-7 (4-7), 2-6 తేడాతో బెరెట్టిన చేతిలో ఓటమి పాలయ్యాడు. తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు.
(REUTERS)(3 / 5)
కొంతకాలంగా గాయాలతో ఇబ్బంది పడుతోన్న జకోవిచ్ ఈ ఏడాది ఆశించిన ఫలితాలు సాధించలేదు. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో క్వార్టర్స్ లో ఓడిపోయాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో జ్వెరెవ్ తో సెమీస్ లో కండరాల నొప్పితో జకోవిచ్ మధ్యలోనే తప్పుకొన్నాడు.
(AFP)(4 / 5)
37 ఏళ్ల జకోవిచ్ కు ఫిట్ నెస్ అతిపెద్ద సవాలుగా మారింది. తరచూ గాయాల బారిన పడుతున్నాడు. 2024లో నంబర్ వన్ ర్యాంకు కోల్పోయాడు. అంతకుముందు వరుసగా 33 వారాల పాటు అతనే నంబర్ వన్. గతేడాది ఒక్క గ్రాండ్ స్లామ్ టోర్నీ కూడా గెలవలేదు. అలా జరగడం 2017 తర్వాత తొలిసారి.
(AFP)ఇతర గ్యాలరీలు