Maha Shivaratri 2025 : తెలంగాణలోని ఏయే ఆలయాల్లో.. శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయో తెలుసా?-shivaratri celebrations are celebrated in 5 temples in telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Maha Shivaratri 2025 : తెలంగాణలోని ఏయే ఆలయాల్లో.. శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయో తెలుసా?

Maha Shivaratri 2025 : తెలంగాణలోని ఏయే ఆలయాల్లో.. శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయో తెలుసా?

Feb 04, 2025, 03:51 PM IST Basani Shiva Kumar
Feb 04, 2025, 03:51 PM , IST

  • Maha Shivaratri 2025 : శివరాత్రి రోజున భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉపవాసం ఉంటారు. రాత్రంతా జాగారం చేస్తారు. ఈ రోజున శివుడిని ఆరాధించడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. శివరాత్రి రోజున తెలంగాణలోని కొన్ని ఆలయాల్లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. అవేంటో ఓసారి చూద్దాం.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ శివరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. శివరాత్రి రోజున లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు.

(1 / 6)

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం కూడా చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ కూడా శివరాత్రి వేడుకలు చాలా వైభవంగా జరుగుతాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తారు.

(2 / 6)

హనుమకొండ నగరంలో ఉన్న వేయి స్తంభాల గుడి కూడా చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ కూడా శివరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీస్ నుంచి భక్తులు వచ్చి ఆ దేవదేవుడిని దర్శించుకుంటారు. 

(3 / 6)

రంగారెడ్డి జిల్లాలో ఉన్న కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం.. అత్యంత ప్రసిద్ధమైనది. ఇక్కడ శివరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. హైదరాబాద్ నగరం సహా.. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. 

(4 / 6)

జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్న అలంపురం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. పాలమూరు నుంచే కాకుండా వివిధ జిల్లాలకు చెందిన భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. 

(5 / 6)

ఈ ప్రదేశాలతో పాటు.. తెలంగాణలోని అన్ని శివాలయాలలో శివరాత్రి వేడుకలు జరుగుతాయి. భక్తులు ఉపవాసాలు ఉండి.. శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివరాత్రి రోజున శివ పురాణం చదవాలని పెద్దలు సూచిస్తారు. అలాగే పేదలకు దానం చేస్తే.. పుణ్యం వస్తుందని చెబుతుంటారు. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు