Shikhar Dhawan Records: గబ్బర్ రూటే సఫరేటు - క్రికెట్‌లో శిఖర్ ధావన్ రేర్ రికార్డులు ఏవంటే?
ఇంటర్‌నేషనల్ క్రికెట్‌కు శనివారం హఠాత్తుగా రిటైర్‌మెంట్ ప్రకటించి అభిమానులకు షాకిచ్చాడు శిఖర్ ధావన్. ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతానని పేర్కొన్నాడు. టీమిండియా తరఫున ధావన్ 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు, 34 టెస్టులు ఆడాడు.
(1 / 5)
అరంగేట్రం టెస్ట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా ధావన్ నిలిచాడు. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో కెరీర్‌ను ప్రారంభించిన ధావన్ ఈ మ్యాచ్‌లో 85 బాల్స్‌లోనే సెంచరీ చేశాడు. ఈ టెస్ట్‌లో 187 పరుగులతో టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాడు.
(2 / 5)
వందో వన్డేలో సెంచరీ చేసిన ఏకైక టీమిండియా క్రికెటర్‌గా ధావన్ పేరిట రికార్డ్ ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పదిమంది మాత్రమే ఈ రికార్డ్ సాధించారు. అందులో ధావన్ ఒకరు.
(3 / 5)
టీ20ల్లో డకౌట్ కాకుండా వరుసగా అరవై ఒక్క ఇన్నింగ్స్‌లు ఆడాడు ధావన్. ధోనీ (84 మ్యాచ్‌లు) తర్వాత ఈ ఘనతను సాధించిన సెకండ్ ఇండియన్ క్రికెటర్‌గా ధావన్ చరిత్రను సృష్టించాడు.
(4 / 5)
ఒకే మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు పట్టిన ఇండియన్ క్రికెటర్‌గా...సచిన్, గవాస్కర్, ద్రావిడ్‌లతో సమంగా ధావన్ నిలిచాడు. అలాగే టెస్టుల్లో ఒకే మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో డకౌట్, మరో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రికార్డ్ కూడా ధావన్ పేరిట ఉంది.
ఇతర గ్యాలరీలు