Sharma and Ambani OTT: ఓటీటీలోకి నేరుగా శర్మ అండ్ అంబానీ.. ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు?-sharma and ambani movie to stream on etv win ott platfrom from april 11 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sharma And Ambani Ott: ఓటీటీలోకి నేరుగా శర్మ అండ్ అంబానీ.. ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు?

Sharma and Ambani OTT: ఓటీటీలోకి నేరుగా శర్మ అండ్ అంబానీ.. ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు?

Apr 10, 2024, 05:57 PM IST Chatakonda Krishna Prakash
Apr 10, 2024, 05:55 PM , IST

  • Sharma and Ambani OTT: శర్మ అండ్ అంబానీ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ చిత్రంలో భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ మూవీ స్ట్రీమింగ్ వివరాలు ఇవే.

శర్మ అండ్ అంబానీ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఈటీవీ వన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చేస్తోంది. ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేశవ్ కర్రీ ప్రధాన పాత్రల్లో నటింటారు. 

(1 / 5)

శర్మ అండ్ అంబానీ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఈటీవీ వన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చేస్తోంది. ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేశవ్ కర్రీ ప్రధాన పాత్రల్లో నటింటారు. (Photo: ETV Win)

శర్మ అండ్ అంబానీ సినిమా ఏప్రిల్ 11వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్‍గా ఉంది. 

(2 / 5)

శర్మ అండ్ అంబానీ సినిమా ఏప్రిల్ 11వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్‍గా ఉంది. (Photo: ETV Win)

శర్మ అండ్ అంబానీ చిత్రానికి కార్తీక్ సాయి దర్శకత్వం వహించారు. అనిల్ పల్లా, భరత్ తిప్పిరెడ్డి నిర్మించిన ఈ మూవీకి శశాంక్ ఆలమూరు, మహా సంగీతం అందించారు. 

(3 / 5)

శర్మ అండ్ అంబానీ చిత్రానికి కార్తీక్ సాయి దర్శకత్వం వహించారు. అనిల్ పల్లా, భరత్ తిప్పిరెడ్డి నిర్మించిన ఈ మూవీకి శశాంక్ ఆలమూరు, మహా సంగీతం అందించారు. (Photo: ETV Win)

శర్మ అండ్ అంబానీ మూవీలో ఆయుర్వేద మందులను అమ్మే శర్మగా భరత్ తిప్పిరెడ్డి, అతడి ప్రేయసి సితారగా ధన్యబాలకృష్ణ నటించారు. షూ పాలిష్ చేసుకునే అంబానీ పాత్రను పోషించారు కేరాఫ్ కంచెర పాలెం ఫేమ్ కేశవ్ కర్రీ.

(4 / 5)

శర్మ అండ్ అంబానీ మూవీలో ఆయుర్వేద మందులను అమ్మే శర్మగా భరత్ తిప్పిరెడ్డి, అతడి ప్రేయసి సితారగా ధన్యబాలకృష్ణ నటించారు. షూ పాలిష్ చేసుకునే అంబానీ పాత్రను పోషించారు కేరాఫ్ కంచెర పాలెం ఫేమ్ కేశవ్ కర్రీ.(Photo: ETV Win)

తమ డైమండ్లు తీసుకున్నారని, తిరిగిచ్చేయాలని ఓ మాఫియా గ్యాంగ్.. శర్మ, అంబానీ వెంటపడడం ఈ చిత్రంలో ప్రధాన అంశంగా కనిపిస్తోంది. శర్మ అండ్ అంబానీ మూవీని ఏప్రిల్ 11 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో చూడొచ్చు.

(5 / 5)

తమ డైమండ్లు తీసుకున్నారని, తిరిగిచ్చేయాలని ఓ మాఫియా గ్యాంగ్.. శర్మ, అంబానీ వెంటపడడం ఈ చిత్రంలో ప్రధాన అంశంగా కనిపిస్తోంది. శర్మ అండ్ అంబానీ మూవీని ఏప్రిల్ 11 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో చూడొచ్చు.(Photo: ETV Win)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు