Shakib Al Hasan World Record: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ వరల్డ్ రికార్డు.. పాకిస్థాన్ పని పట్టి రికార్డు బుక్కుల్లోకి..
- Shakib Al Hasan World Record: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. పాకిస్థాన్ తో జరిగిన తొలి టెస్టులో చెలరేగిన అతడు.. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డేనియల్ వెటోరీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
- Shakib Al Hasan World Record: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. పాకిస్థాన్ తో జరిగిన తొలి టెస్టులో చెలరేగిన అతడు.. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డేనియల్ వెటోరీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
(1 / 5)
Shakib Al Hasan World Record: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ పాకిస్థాన్ తో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 1, రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీయడం ద్వారా ఈ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న లెఫ్టామ్ స్పిన్నర్ గా వెటోరీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
(2 / 5)
Shakib Al Hasan World Record: పాకిస్థాన్ తో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్ లో రెండో వికెట్ తీయడం ద్వారా షకీబ్ ఈ రికార్డు క్రియేట్ చేశాడు. షకీబ్ ఇప్పటి వరకూ మొత్తంగా మూడు ఫార్మాట్లు కలిపి అంతర్జాతీయ క్రికెట్ లో 444 మ్యాచ్ లు ఆడి 707 వికెట్లు తీసుకున్నాడు.
(3 / 5)
Shakib Al Hasan World Record: షకీబల్ హసన్ ఇప్పటి వరకూ 68 టెస్టుల్లో 241 వికెట్లు, 247 వన్డేల్లో 317 వికెట్లు, 129 టీ20ల్లో 149 వికెట్లు తీసుకున్నాడు.
(4 / 5)
Shakib Al Hasan World Record: న్యూజిలాండ్ మాజీ బౌలర్ డేనియల్ వెటోరీ 442 అంతర్జాతీయ మ్యాచ్ లలో 705 వికెట్లు తీశాడు. అతడు 113 టెస్టుల్లో 362 వికెట్లు, 295 వన్డేల్లో 305 వికెట్లు, 34 టీ20ల్లో 38 వికెట్లు తీసుకున్నాడు.
ఇతర గ్యాలరీలు