ఏపీలో తీవ్ర వడగాలులు, తెలంగాణలో తేలికపాటి వర్షాలు-రేపటి వెదర్ రిపోర్ట్ ఇదే-severe heatwave in ap light rains in telangana tomorrow weather report ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఏపీలో తీవ్ర వడగాలులు, తెలంగాణలో తేలికపాటి వర్షాలు-రేపటి వెదర్ రిపోర్ట్ ఇదే

ఏపీలో తీవ్ర వడగాలులు, తెలంగాణలో తేలికపాటి వర్షాలు-రేపటి వెదర్ రిపోర్ట్ ఇదే

Published May 10, 2025 08:10 PM IST Bandaru Satyaprasad
Published May 10, 2025 08:10 PM IST

ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణం కనిపిస్తుంది. ఏపీలో ఎండలు తీవ్రమవుతున్నాయి. తెలంగాణలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణం కనిపిస్తుంది. ఏపీలో ఎండలు తీవ్రమవుతున్నాయి. తెలంగాణలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

(1 / 6)

రేపు(ఆదివారం) ఏపీలోని 19 మండలాల్లో తీవ్ర వడగాలులు, 30 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి జిల్లాలో 11 మండలాలు, అనకాపల్లి 8 మండలాల్లో తీవ్రవడగాలులు(19) వీచే అవకాశం ఉంది. మరో 30 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

(2 / 6)

ఇవాళ తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.7°C, విజయనగరంలో41.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యయాని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

(3 / 6)

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

(4 / 6)

రానున్న మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

(5 / 6)

నేడు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 కి.మీ. నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

(6 / 6)

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు