(1 / 8)
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు సుహాసిని. అగ్ర హీరోలతో హీరోయిన్‌గా నటించిన సుహాసిని డైరెక్టర్ మణిరత్నంను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
(2 / 8)
పెళ్లి తర్వాత పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన నటి సుహాసిని అనంతరం మూవీస్‌కు దూరంగా ఉంటున్నారు. కానీ, సుహాసిని చెల్లెలు మాత్రం పాన్ ఇండియా రేంజ్‌లో హీరోయిన్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
(3 / 8)
ఇంతకీ సుహాసిని చెల్లెలు ఎవరో కాదు బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రుతి హాసన్. లోక నాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ మొదట సింగర్‌గా అలరించింది.
(4 / 8)
ఆ తర్వాత బాలీవుడ్‌లో లక్, తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమాలతో హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది గ్లామరస్ బ్యూటి శ్రుతి హాసన్. తెలుగు, తమిళం, హిందీ ఎన్నో సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది శ్రుతి హాసన్.
(5 / 8)
తెలుగులో రవితేజ, రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్, చిరంజీవి, పవన్ కల్యాణ్, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలతో యాక్ట్ చేసి స్టార్ హీరోయిన్ అయింది. అలాగే, ప్రభాస్ సరసన సలార్‌లో నటించి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకుంది శ్రుతి హాసన్.
(6 / 8)
అయితే, సీనియర్ హీరోయిన్ సుహాసినికి శ్రుతి హాసన్ చెల్లెలు అవుతుంది. కానీ, ఈ విషయం చాలా మందికి తెలియదు. శ్రుతి హాసన్ తండ్రి కమల్ హాసన్‌కు చారు హాసన్, చంద్ర హాసన్ అని ఇద్దరు సోదరులు ఉన్నారు.
(Instagram/Shruti Haasan)(7 / 8)
కమల్ హాసన్ సోదరుల్లో ఒకరైన చారు హాసన్ కుమార్తె నటి సుహాసిని. అంటే, సుహాసినికి కమల్ హాసన్ బాబాయ్ వరుస అవుతాడు. ఇలా సుహాసిని శ్రుతి హాసన్ ఇద్దరు అక్కాచెల్లెల్లు అవుతారు.
ఇతర గ్యాలరీలు