Self neglect: సెల్ఫ్ నెగ్లెక్ట్ లేదా స్వీయ నిర్లక్ష్యం.. అంటే ఏంటి? ఇది అంత ప్రమాదకరమా?
- స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్.. వీటి దుష్పరిమాణాలు అనేకం. వీటితో పాటు సెల్ఫ్ నెగ్లెక్ట్ మరో ప్రమాదకరమైన ధోరణి. నెగెటివిటీ,ముఖ్యమైన వాటిని వాయిదా వేసే మనస్తత్వం, భావోద్వేగాలను అణచివేసుకోవడం మొదలైనవి స్వీయ-నిర్లక్ష్యానికి కొన్ని సంకేతాలు.

(1 / 6)
మనకు, మన భావోద్వేగాలకు ప్రాధాన్యమివ్వనప్పుడు మనల్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటాం. ‘మీ భావోద్వేగాలను విస్మరిస్తున్నారా? భావోద్వేగ అవసరాలకు ప్రాధాన్యత లేదని చిన్నతనం నుంచే మనకు నేర్పిస్తారు. అది తప్పు. భావోద్వేగాలను అణచివేయడం కూడా మంచిది కాదు అని మనస్తత్వవేత్త కరోలిన్ రూబెన్స్టీన్ స్వీయ-నిర్లక్ష్య సంకేతాలను వివరిస్తూ రాశారు.(Unsplash)
(2 / 6)
విచారం, కోపం, నిరాశ వంటి క్లిష్టమైన భావోద్వేగభరిత సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, వాటిని అణచివేయడానికి, లేదా విస్మరించడానికి ప్రయత్నిస్తాము.(Unsplash)
(3 / 6)
సన్నిహిత మానవ సంబంధాలకు లేదా లోతైన సంభాషణలకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. మన భావోద్వేగ సమస్యలను ఇతరులతో చర్చించడానికి ఇష్టపడము. (Unsplash)
(4 / 6)
మనకి మనం ప్రాధాన్యత ఇచ్చుకోవడానికి బదులుగా, మన భావోద్వేగాలను ప్రకటించడానికి బదులుగా.. ఇతరుల అవసరాలు, భావాలకు ప్రాధాన్యత ఇస్తాము. వాటిపైనే ఎక్కువ దృష్టి పెడతాము. (Unsplash)
(5 / 6)
మన సంతోషం మీద మనం దృష్టి పెట్టం. మనకు ఆనందాన్ని, విశ్రాంతిని, సంతృప్తిని కలిగించే విషయాలను పట్టించుకోం. అవి అనవసరమైనవిగా భావిస్తాం. వాటిని తిరస్కరిస్తాం.(Unsplash)
ఇతర గ్యాలరీలు