Vasantha Panchami 2023 । దేశంలోని వివిధ ప్రాంతాలలో వసంత పంచమిని ఎలా జరుపుకుంటారో చూడండి!-see how different regions of india are celebrating vasantha panchami 2023 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  See How Different Regions Of India Are Celebrating Vasantha Panchami 2023

Vasantha Panchami 2023 । దేశంలోని వివిధ ప్రాంతాలలో వసంత పంచమిని ఎలా జరుపుకుంటారో చూడండి!

Jan 25, 2023, 07:59 PM IST HT Telugu Desk
Jan 25, 2023, 07:59 PM , IST

Vasantha Panchami 2023: ఈ ఏడాది జనవరి 26న వసంత పంచమి వస్తుంది. దేశవ్యాప్తంగా ప్రజలు తమదైన రీతిలో పండుగను జరుపుకుంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ పర్వదినాన్ని ఎలా జరుపుకుంటారో చూద్దాం

వసంత పంచమి పండుగ వసంత రుతువు ఆగమనాన్ని సూచిస్తుంది, ఈరోజున భారతదేశంలోని చాలా ప్రదేశాలలో సరస్వతీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.

(1 / 6)

వసంత పంచమి పండుగ వసంత రుతువు ఆగమనాన్ని సూచిస్తుంది, ఈరోజున భారతదేశంలోని చాలా ప్రదేశాలలో సరస్వతీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.(ANI)

పశ్చిమ బెంగాల్‌, బీహార్, జార్ఖండ్ మొదలైన ఈశాన్య భారతదేశ రాష్ట్రాలలో వసంత పంచమిని సరస్వతి పూజ పేరుతో జరుపుకుంటారు.  ఇక్కడ గణేష్ చతుర్థి, దసరా పండుగలలాగే సరస్వతీదేవికి ప్రత్యేక పూజా పాండల్స్ ఏర్పాటు చేస్తారు. సామాజిక అంశాల ఇతివృత్తాలతో సమస్యలను ప్రస్తావిస్తూ వారికి జ్ఞానాన్ని ప్రసాదించాల్సిందిగా సరస్వతిని కోరుతూ ఇలా వేదికలను కూడా ఏర్పాటు చేస్తారు. 

(2 / 6)

పశ్చిమ బెంగాల్‌, బీహార్, జార్ఖండ్ మొదలైన ఈశాన్య భారతదేశ రాష్ట్రాలలో వసంత పంచమిని సరస్వతి పూజ పేరుతో జరుపుకుంటారు.  ఇక్కడ గణేష్ చతుర్థి, దసరా పండుగలలాగే సరస్వతీదేవికి ప్రత్యేక పూజా పాండల్స్ ఏర్పాటు చేస్తారు. సామాజిక అంశాల ఇతివృత్తాలతో సమస్యలను ప్రస్తావిస్తూ వారికి జ్ఞానాన్ని ప్రసాదించాల్సిందిగా సరస్వతిని కోరుతూ ఇలా వేదికలను కూడా ఏర్పాటు చేస్తారు. (ANI)

పంజాబీలు బసంత్ పంచమిని ప్రత్యేక దుస్తులు ధరించి  జానపద సంగీతం, నృత్యాలతో వేడుకగా చేసుకుంటారు.  తమ సాంప్రదాయ ఆహారాన్ని తింటూ ఆస్వాదిస్తారు. 

(3 / 6)

పంజాబీలు బసంత్ పంచమిని ప్రత్యేక దుస్తులు ధరించి  జానపద సంగీతం, నృత్యాలతో వేడుకగా చేసుకుంటారు.  తమ సాంప్రదాయ ఆహారాన్ని తింటూ ఆస్వాదిస్తారు. (WSJ)

గుజరాత్ రాష్ట్రంలో, ప్రజలు పసుపు బట్టలు ధరించి సరస్వతీ దేవిని పూజిస్తారు

(4 / 6)

గుజరాత్ రాష్ట్రంలో, ప్రజలు పసుపు బట్టలు ధరించి సరస్వతీ దేవిని పూజిస్తారు

ఉత్తరాఖండ్‌లో, ప్రజలు ఈ రోజున సరస్వతి దేవితో, శివుడు, పార్వతి దేవిని పూజిస్తారు. ప్రజలంతా ఒక్కచోట చేరి పెద్ద ఎత్తున విందులు చేసుకుంటారు. 

(5 / 6)

ఉత్తరాఖండ్‌లో, ప్రజలు ఈ రోజున సరస్వతి దేవితో, శివుడు, పార్వతి దేవిని పూజిస్తారు. ప్రజలంతా ఒక్కచోట చేరి పెద్ద ఎత్తున విందులు చేసుకుంటారు. (PiggyRide)

తెలంగాణ రాష్ట్రంలోని బాసర, శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తారు. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారని భక్తుల నమ్మకం. 

(6 / 6)

తెలంగాణ రాష్ట్రంలోని బాసర, శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తారు. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారని భక్తుల నమ్మకం. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు