ఉగ్రదాడి ఎఫెక్ట్ - తిరుపతిలో భద్రతా దళాల 'మాక్ డ్రిల్'-security forces conducted a mock drill at kapila theertham temple tirupati in the wake of the pahalgam terror attack ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఉగ్రదాడి ఎఫెక్ట్ - తిరుపతిలో భద్రతా దళాల 'మాక్ డ్రిల్'

ఉగ్రదాడి ఎఫెక్ట్ - తిరుపతిలో భద్రతా దళాల 'మాక్ డ్రిల్'

Published May 04, 2025 11:12 AM IST Maheshwaram Mahendra Chary
Published May 04, 2025 11:12 AM IST

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలతో పాటు తిరుపతిలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో కపిల తీర్థం ఆలయంలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ చేపట్టాయి. ఈ ఫొటోలు ఇక్కడ చూడండి…

 కశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా తిరుపతిలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి.

(1 / 7)

తిరుపతిలోని శ్రీ కపిలతీర్థం ఆలయంలోకి ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టాలనే అంశంపై ఆక్టోపస్, పోలీసు, టిటిడి విజిలెన్స్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టిగా మాక్ డ్రిల్ నిర్వహించారు.

(2 / 7)

ముందుగా కపిలతీర్థం సమీపంలో జిల్లా అటవీ శాఖ కార్యాలయం ప్రాంగణం నుండి ఆక్టోపస్ బలగాలు మూడు గ్రూపులుగా వ్యూహాత్మకంగా సమన్వయంతో ఆలయంలోకి ప్రవేశించి భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను శుక్రవారం సాయంత్రం మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు.

(3 / 7)

ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా మ‌రియు భ‌ద్ర‌తా, సివిల్ పోలీసులకు, బాంబ్ స్క్వాడ్, రిజర్వ్ సిబ్బందికి, వైద్య, ఫైర్ సిబ్బందికి, రెవిన్యూ , ట్రాఫిక్ సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు.

(4 / 7)

దాదాపు రెండు గంటలపాటు ఈ మాక్ డ్రిల్ కొన‌సాగింది. ఈ మాక్ డ్రిల్ 40 మంది ఆక్టోప‌స్ కమాండోలు, 10 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 15 మంది పోలీసులు, 13 ఏఆర్ సిబ్బంది, 12 మంది మెడికల్ సిబ్బంది, ఫైర్ , ఆర్మ్డ్ , బాంబ్ స్క్వాడ్, ఎలక్ట్రికల్ , వాటర్, గ్యాస్ శాఖల సిబ్బంది మాక్ డ్రిల్ లో భాగ‌మ‌య్యారు.

(5 / 7)

ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ సి. రాజారెడ్డి, డిఎస్పీ మధుసుధన్ రావు ఆధ్వర్యంలో ఈ మాక్ డ్రిల్  కార్యక్రమం చేపట్టారు.

(6 / 7)

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి విజిలెన్స్, పోలీసు, ఆక్టోపస్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. పెహల్గాన్ ఉగ్రదాడి నేపథ్యంలో…. తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లోనూ భద్రత పెంచారు.

(7 / 7)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు