GSWS Employees: ఏపీలో శాశ్వత వాలంటీర్లుగా సచివాలయ ఉద్యోగులు.. పని భారంతో సతమతం.. సాంకేతిక సిబ్బంది ఇతర శాఖలకు కేటాయింపు
- GSWS Employees: ఏపీలో సచివాలయాల క్రమబద్దీకరణ, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై పనిభారం పెరిగింది. క్షేత్ర స్థాయి విధులతో పాటు సచివాలయాల క్రమబద్దీకరణతో పనిభారం పెరిగింది. పేరుకు ప్రభుత్వ ఉద్యోగులైనా పర్మనెంట్ వాలంటీర్లుగా మార్చేశారని ఉద్యోగులు వాపోతున్నారు.
- GSWS Employees: ఏపీలో సచివాలయాల క్రమబద్దీకరణ, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై పనిభారం పెరిగింది. క్షేత్ర స్థాయి విధులతో పాటు సచివాలయాల క్రమబద్దీకరణతో పనిభారం పెరిగింది. పేరుకు ప్రభుత్వ ఉద్యోగులైనా పర్మనెంట్ వాలంటీర్లుగా మార్చేశారని ఉద్యోగులు వాపోతున్నారు.
(1 / 7)
ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై పనిభారం పెరిగింది. దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లను తొలగించడంతో వారి పనులు కూడా సచివాలయ ఉద్యోగులే చేయాల్సి వస్తోంది.
(2 / 7)
సచివాలయాల విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అందులో పనిచేస్తున్న లక్షా 30వేల మంది ఉద్యోగులపై పని భారం పెరిగినట్టు చెబుతున్నారు. కార్పొరేషన్లలో సిబ్బందిని ఇతర శాఖలకు కేటాయించడం ఇప్పటికే మొదలైంది.
(3 / 7)
సచివాలయాల్లో ఆధార్ సహా, 300కు పైగా పౌర సేవలు అందించాలని గత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం మారడంతో సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులు జరిగాయి. సచివాలయాల స్థానంలో వాట్సప్ గవర్నెన్స్‌కు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. క్షేత్ర స్థాయి సర్వేల నుంచి శాఖల వారీగా బాధ్యతలు కూడా ఉద్యోగులే చేయాల్సి వస్తోంది.
(4 / 7)
గ్రామ, వార్చు సచివాలయాల్లో దాదాపు 9రకాల విధులు నిర్వర్తించే సిబ్బందితో 15వేలకు పైగా సచివాలయాలు 2019లో ఏర్పాటయ్యాయి. వీటిలో లక్షా 30వేల మంది పనిచేస్తున్నారు. ప్రతి సచివాలయంలో సచివాలయ కార్యదర్శి, ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీ, వార్డ్ హెల్త్ సెక్రటరీ, ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్ సెక్రటరీ, ఎనర్జీ సెక్రటరీ, శానిటేషన్ సెక్రటరీలతో సచివాలయాలకు రూపకల్పన చేశారు.
(5 / 7)
గ్రామ సచివాలయాలకు లైన్ డిపార్ట్‌మెంట్‌లను కేటాయించినా వాటిలో అంతర్భాగాలుగా గుర్తించకపోవడంతో అదనపు వ్యవస్థగానే కొనసాగుతున్నాయి. ఉద్యోగాలకు సంబంధించిన సర్వీస్ రూల్స్ రూపకల్పనలో స్పష్టత కొరవడింది. ప్రభుత్వ శాఖలకు అనుబంధంగా కొనసాగడంతో సచివాలయాలకు నేరుగా పౌర సేవలు అందించే అవకాశం లేకుండా పోయింది.
(6 / 7)
సచివాలయాల్లో పనిచేస్తున్న ప్లానింగ్ సెక్రటరీలు, డిజిటల్ అసిస్టెంట్లను ఇతర ప్రభుత్వ విభాగాలకు తరలిస్తున్నారు. విజయవాడ వంటి నగరాల్లో సీఆర్‌డిఏ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వంటి విభాగాలకు ప్లానింగ్ సెక్రటరీలను కేటాయిస్తున్నారు.
(7 / 7)
ప్రస్తుతం ఉన్న సచివాలయాలను క్రమబద్దీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జనాభాకు అనుగుణంగా సిబ్బందిని కుదిస్తున్నారు. దీంతో పాటు సచివాలయాల సంఖ్యను కూడా కుదించే ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఓ వైపు వాలంటీర్లను తొలగించడం, మరోవైపు సచివాలయాలను కుదించడంతో సిబ్బందిపై పనిభారం పెరిగిందని చెబుతున్నారు.
ఇతర గ్యాలరీలు