(1 / 8)
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి. దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తై…. అర్హతలు ఉన్న వారికి కార్డులను ఇస్తున్నారు. మరికొందరి పేర్లను పాత కార్డుల్లోకి కూడా ఎంట్రీ చేస్తున్నారు. పేర్ల తొలగింపు ప్రక్రియ కూడా కొనసాగుతోంది.
(2 / 8)
కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్రవ్యాప్తంగానూ భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ప్రజాపాలన కార్యక్రమాల ద్వారా ఆఫ్ లైన్ లో అప్లికేషన్లు స్వీకరించగా…. ఆ తర్వాత మీసేవా ఆన్ లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు.
(3 / 8)
ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆన్ లైన్ చేస్తుండగా… మరోవైపు మీసేవా దరఖాస్తులను కూడా పరిశీలిస్తున్నారు. అయితే హైదరాబాద్ నగరంలో రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. వీరంతా కూడా కొత్త కార్డులు ఎప్పుడు వస్తాయంటూ వేచి చేస్తున్నారు. ప్రజాపాలనలో చేసుకున్న వాళ్లు సర్కిల్ లేదా వార్డు ఆఫీసులను సంప్రదిస్తున్నారు. ఇక మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఆన్ లైన్ లో స్టేటస్ చెక్ చేసుకుంటున్నారు.
(4 / 8)
భారీగా దరఖాస్తులు వస్తుండటంతో… వెరిఫికేషన్ ప్రక్రియ ఇబ్బందికరంగా మారింది. హైదరాబాద్ నగర పరిధిలో 4 లక్షలకుపై దరఖాస్తులు రావటంతో… వీటిని పరిశీలించేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. పైగా సిబ్బంది కొరత ఉండటంతో… కార్డుల మంజూరు ప్రక్రియ ఆలస్యమవుతోంది.
(5 / 8)
రేషన్ కార్డుల కోసం కేవలం ఒక్కచోటు మాత్రమే కాకుండా రెండు మూడు చోట్ల దరఖాస్తు చేసుకోవటంతో పరిశీలన ఇబ్బందికరంగా మారింది. ప్రజాపాలనతో పాటు మీసేవా, కలెక్టరేట్ప్రజావాణిలో కూడా పలువురు దరఖాస్తులు పెట్టారు. వీటన్నింటిని పరిశీలించేందుకు సిబ్బంది కొరత ఉండటంతో…. కొత్త కార్డుల మంజూరు ప్రక్రియ అనుకున్నంత వేగంగా ముందుకు సాగటం లేదు.
(6 / 8)
రేషన్ కార్డు దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిస్థాయిలో జూన్ నెల నుంచి షురూ పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. అప్పటిలోపు సిబ్బంది కొరతను అధిగమించి.. ముందుకెళ్లే విధంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ చేసిన తర్వాత కొత్త కార్డులను జారీ చేయనున్నారు.
(7 / 8)
రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కాబట్టి అర్హత గల వారు కొత్త కార్డుల విషయంలో ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అధికారులు గుర్తు చేస్తున్నారు. నిరంతరం దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని… ఆపై వెరిఫికేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోందని చెబుతున్నారు.
(8 / 8)
కొత్త రేషన్ కార్డు పొందినవాళ్లు లేదా పాత కార్డులో పేర్లు నమోదైన వారు... వారి వివరాలను ఆన్ లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ముందుగా https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఎఫ్ఎస్ సీ సెర్చ్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ రేషన్ కార్డు సెర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే FSC సెర్చ్ అనే ఆప్షన్ డిస్ ప్లే అవుతుంది. దీనిపై క్లిక్ చేసి FSC Ref No నెంబర్ లేదా మీ రేషన్ కార్డు నెంబర్ ను ఎంట్రీ చేసి జిల్లాను ఎంచుకోవాల్లి. చివర్లో ఉండే సెర్చ్ పై క్లిక్ చేస్తే మీ కార్డు వివరాలను కింద డిస్ ప్లే అవుతాయి.
ఇతర గ్యాలరీలు