(1 / 6)
రైల్వే ప్రయాణీకులకు సరికొత్త అనుభూతితో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను భారత రైల్వే చేపడుతోంది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ లో భాగంగా ఏపీలోని భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రూపురేఖలను మార్చేలా మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఇందుకు అనుగుణంగా పనులు కొనసాగుతున్నాయి.
(2 / 6)
విజయవాడ డివిజన్ పరిధిలో భీమవరం టౌన్ (BVRT) రైల్వే స్టేషన్ ఉంది, దీనిని రూ.32.37 కోట్ల వ్యయంతో ఆధునీకరిస్తున్నారు. దీని ద్వారా రోజుకు సగటున 7587 మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు. వార్షిక ఆదాయం 33.20 కోట్లుగా ఉంటుంది. అన్ని ఎక్స్‌ప్రెస్ మరియు ప్యాసింజర్ రైళ్లు ఈ స్టేషన్‌లో ఆగుతాయి.
(3 / 6)
భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. వరి ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా ఉంది. ఇక్కడ్నుంచి పుడ్ ప్రాసెసింగ్ తో పాటు అనేక ఆహార పదార్థాలు ట్రాన్స్ పోర్ట్ అవుతుంటాయి. అంతేకాకుండా… ఇక్కడ్నుంచి ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగానే ఉంటాయి.
(4 / 6)
ఆధునీకరణ పనుల్లో భాగంగా… అదనపు కవర్ ఓవర్ ప్లాట్‌ఫారమ్‌ల ఏర్పాటు చేస్తారు. ప్లాట్‌ఫారమ్ ఉపరితలానికి మెరుగులు దిద్దుతారు, ప్రీమియం మాడ్యులర్ టాయిలెట్ల ఏర్పాటు (పురుషులు, మహిళలు & దివ్యాంగులకు ప్రత్యేకం) చేస్తారు.నూతన వెయిటింగ్ హాల్ ఏర్పాటుతో పాటు ఎంట్రెన్స్ ను సుందరీకరిస్తారు. స్టేషన్ లైటింగ్, PF లైటింగ్, సర్క్యులేటింగ్ ఏరియా లైటింగ్ తో పాటు మరికొన్ని పనులు చేపడుతారు.
(5 / 6)
ప్లాట్‌ఫామ్ ఉపరితలం, ప్లాట్‌ఫామ్ కవర్ షెల్టర్లు, వెయిటింగ్ హాల్, మాడ్యులర్ టాయిలెట్, ముఖభాగం, సర్క్యులేటింగ్ ఏరియా మరియు లిఫ్ట్ పనులు 55 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు