తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Update: ఏపీ, తెలంగాణల్లో చెదురుమదురుగా వర్షాలు, అల్పపీడనంపై కొనసాగుతున్న సందిగ్ధత…
- AP TG Weather Update: ఆంధ్రప్రదేశ్ తో పాటు యానంలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి.బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటానికి అనువైన వాతావరణం ఉందని ఐఎండి విశాఖపట్నం అంచనా వేస్తోంది.ఆదివారానికి మరో అల్పపీడనంపై స్పష్టత వస్తుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
నేడు ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
(2 / 6)
శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. మరోవైపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అనువైన వాతవరణం ఉంది. దీనిపై ఆదివారం నాటికి స్పష్టత వస్తుందని ఐఎండి అధికారులు చెబుతున్నారు.
(3 / 6)
అల్పపీడనానికి అనువైన వాతావరణం బంగాళాఖాతంలో ఉండటంతో ఉత్తరాంధ్రలో అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
(4 / 6)
ఇక తెలంగాణలో వాతావరణం మేఘావృతమై ఉన్నా ప్రస్తుతం వర్ష సూచనలు లేవు. చలి తీవ్రత కూడా సాధారణంగా ఉంటోంది. రాత్రి ఉష్ణోగ్రతలు డిసెంబర్ 10నాటికి తగ్గే అవకాశం ఉంది.
(5 / 6)
డిసెంబర్ మొదటి వారంలో భారీ వర్ష సూచనలతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంటకోతలు వేగంగా పూర్తి చేశారు. సాధారణంగా జనవరి వరకు కొనసాగే పంట కోతల్ని తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందే పూర్తి చేశారు.
ఇతర గ్యాలరీలు