Top 10 stocks for 2024: వచ్చే ఏడాది ఈ టాప్ 10 స్టాక్స్ తో లాభాలు గ్యారెంటీ..-sbi tcs jsw energy and more smc global lists top 10 stock picks for 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Top 10 Stocks For 2024: వచ్చే ఏడాది ఈ టాప్ 10 స్టాక్స్ తో లాభాలు గ్యారెంటీ..

Top 10 stocks for 2024: వచ్చే ఏడాది ఈ టాప్ 10 స్టాక్స్ తో లాభాలు గ్యారెంటీ..

Published Dec 27, 2023 05:51 PM IST HT Telugu Desk
Published Dec 27, 2023 05:51 PM IST

Top 10 stocks for 2024: 2023లో భారత మార్కెట్ అద్భుతమైన ఫలితాలను సాధించింది. నిఫ్టీ 21,000 స్థాయిని, సెన్సెక్స్ 72,000 మార్క్‌ను అధిగమించాయి. బ్రోకరేజ్ సంస్థ SMC గ్లోబల్ అంచనాల ప్రకారం.. 2024 లో ఈ కింద పేర్కొన్న స్టాక్స్ మంచి లాభాలను సాధిస్తాయి.  

TCS: 2024 లో కచ్చితంగా లాభాలను ఆర్జించే సంస్థ టీసీఎస్. ఎస్ఎంసీ గ్లోబల్ అంచనాల ప్రకారం 2024 లో టీసీఎస్ టార్గెట్ ధర రూ. 4,308.

(1 / 10)

(Bloomberg)

State Bank of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 టార్గెట్ ధర రూ. 791. అంటే, ప్రస్తుత ధరతో పోలిస్తే, సుమారు 23% అధికం. వివిధ పేరామీటర్స్ లో బ్యాంక్ పనితీరు సానుకూలంగా ఉంది. అసెట్ క్వాలిటీ, వినియోగదారుల విశ్వాసం ఎస్బీఐ కి అదనపు బలం. 

(2 / 10)

(REUTERS)

HCL Technologies: హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఐటీ స్టాక్ టార్గెట్ ధరను రూ. 1,619 గా ఎస్ఎంసీ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ నిర్ధారించింది.అంటే, ప్రస్తుత ధరపై ఇది 14% అధికం. సంస్థ డీల్ లను పరిశీలిస్తే, Q3, Q4లలో చాలా ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించగలదని తెలుస్తుంది.

(3 / 10)

Maruti Suzuki: మారుతీ సుజుకి టార్గెట్ ధరను రూ. 12,405 గా బ్రోకరేజ్ సంస్థ SMC గ్లోబల్ అంచనా వేస్తోంది. దీని బలమైన బ్రాండ్ అప్పీల్, దృఢమైన ఉత్పత్తి శ్రేణి, క్రమ పద్ధతిలో కొత్త మోడళ్లను విడుదల చేసే సామర్థ్యం కారణంగా తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ ఆటో ఇండస్ట్రీలో అగ్రగామిగా కొనసాగుతోంది. 

(4 / 10)

Hindalco Industries: హిండాల్కో ఇండస్ట్రీస్ టార్గెట్ ధరను రూ. 690 గా బ్రోకరేజ్ సంస్థ SMC గ్లోబల్ భావిస్తోంది, ఇది ప్రస్తుత ధరపై 24% పెరుగుదలను సూచిస్తుంది. ఈ సంస్థ బలమైన బ్యాలెన్స్ షీట్ ను కలిగి ఉంది. అలాగే, దీనికి దేశీయ డిమాండ్ బలంగా ఉంది, ముఖ్యంగా ఆటో, ఏరోస్పేస్, బేవరేజెస్ క్యాన్స్ నుంచి బలమైన దేశీయ డిమాండ్‌ ఉంది.

(5 / 10)

Havells India: హావెల్స్ ఇండియా టార్గెట్ ధరను రూ. 1,668 గా నిర్ణయించారు. ఇది ప్రస్తుత ధరపై 24% అధికం. కంపెనీకి బలమైన బ్యాలెన్స్ షీట్ ఉంది. గత కొన్ని సంవత్సరాలలో, కంపెనీ ఆధునిక రీటైల్, ప్రాంతీయ రిటైలర్లు, ఆన్‌లైన్‌లో తన ఉనికిని విస్తరించింది,

(6 / 10)

JSW Energy: జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ పై  బ్రోకరేజ్ సంస్థ రూ. 473 టార్గెట్ ధరను నిర్ణయించింది. ఇది 13% పెరుగుదలను సూచిస్తుంది. ఏప్రిల్ 2025 నాటికి 1 గిగావాట్ సోలార్ మాడ్యూల్ తయారీతో పాటుగా 2030 నాటికి 20 గిగావాట్ ఇన్‌స్టాల్ జెనరేషన్ కెపాసిటీ, 40 GWh/5 GW శక్తి నిల్వను చేరుకోవాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని కంపెనీ పెట్టుకుంది. ఈ పెరుగుదల బ్యాలెన్స్ షీట్ పరిమాణం పెరగడానికి దారి తీస్తుంది. 

(7 / 10)

Indian Bank: ఇండియన్ బ్యాంక్ స్టాక్ కు బ్రోకరేజ్ సంస్థ రూ. 497 టార్గెట్ ధరగా పేర్కొంది. ఇది 20% పెరుగుదలను సూచిస్తుంది. అడ్వాన్సులు, డిపాజిట్లలో ఆరోగ్యకరమైన వృద్ధితో పాటు అసెట్ క్వాలిటీలో మెరుగుదలని బ్యాంక్ సాధించింది. డిజిటల్ బ్యాంకింగ్‌ ద్వారా వ్యాపారాన్ని వ్యూహాత్మకంగా విస్తరిస్తోంది.

(8 / 10)

Amara Raja Batteries: అమర రాజా బ్యాటరీస్ స్టాక్ కు ఎస్ఎంసీ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ రూ. 904 ను టార్గెట్ ధరగా పేర్కొంది. ఇది 19% పెరుగుదలను సూచిస్తుంది. కంపెనీకి సంబంధించిన అన్ని ఉత్పత్తి విభాగాలలో డిమాండ్ సంకేతాలు సానుకూలంగా ఉన్నాయి. ఆటోమోటివ్, టెలికాం విభాగాలలో స్థిరమైన వృద్ధి కనిపిస్తోంది. EV ఛార్జర్‌లు, బ్యాటరీ ప్యాక్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది.

(9 / 10)

Kalpataru Power Projects: కల్పతరు పవర్ ప్రాజెక్ట్స్ కుబ్రోకరేజ్ సంస్థ రూ.761 టార్గెట్ ధర ను నిర్ణయించింది. ఇది ప్రస్తుత ధరపై 21% పెరుగుదలను సూచిస్తుంది. కంపెనీ నిర్వహణ ప్రకారం, డేటా సెంటర్లు, విమానాశ్రయాలు, హెవీ సివిల్, డిజైన్-బిల్డ్ B&F ప్రాజెక్ట్‌లు, పారిశ్రామిక ప్రాజెక్టులు వంటి రంగాలలో సంస్థ బలంగా దూసుకుపోతోంది.

(10 / 10)

Kalpataru Power Projects: కల్పతరు పవర్ ప్రాజెక్ట్స్ కు

బ్రోకరేజ్ సంస్థ రూ.761 టార్గెట్ ధర ను నిర్ణయించింది. ఇది ప్రస్తుత ధరపై 21% పెరుగుదలను సూచిస్తుంది. కంపెనీ నిర్వహణ ప్రకారం, డేటా సెంటర్లు, విమానాశ్రయాలు, హెవీ సివిల్, డిజైన్-బిల్డ్ B&F ప్రాజెక్ట్‌లు, పారిశ్రామిక ప్రాజెక్టులు వంటి రంగాలలో సంస్థ బలంగా దూసుకుపోతోంది.

ఇతర గ్యాలరీలు