తెలుగు న్యూస్ / ఫోటో /
30 ఏళ్ల తర్వాత ఈ గ్రహాల అరుదైన కలయిక.. 2025లో లక్కుతోపాటు డబ్బు చూసే రాశులు వీరే!
- Saturn Rahu Conjunction : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఈ సంవత్సరంలో అనేక గ్రహ మార్పులు, గ్రహ సంయోగాలు జరుగుతాయి. ప్రధాన గ్రహాల స్థానాల మార్పు ప్రభావం అన్ని రాశివారిపైనా కనిపిస్తుంది. అయితే శని, రాహువు కలయికతో కొన్ని రాశులవారికి అదృష్టం పట్టుకుంటుంది.

(1 / 5)
శని 2025 మార్చిలో కుంభరాశి నుండి మీనరాశికి సంచరించనున్నాడు. శని మీనంలోకి వెళ్లినప్పుడు అదే రాశిలో ఉన్న రాహువుతో కలుస్తాడు. మీన రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక 30 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఈ గ్రహ కలయిక ముఖ్యంగా కొన్ని రాశి వారికి అదృష్టంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులు ఏంటో చూద్దాం..
(2 / 5)
రాహువు మేషరాశిలోని 12వ ఇంట్లో శనితో కలిసి ఉంటాడు. ఈ రాశి వారికి చాలా మంచిది. ముఖ్యంగా కొందరికి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మీరు చాలా డబ్బు సంపాదించడానికి అవకాశం పొందుతారు. విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి బాగుంటుంది. ప్రతి పనిలో విజయం, సమాజంలో విలువ, గౌరవం పెరుగుతాయి.
(3 / 5)
రాహువు వృషభ రాశిలోని 11వ ఇంట్లో శనితో కలిసి ఉంటాడు. దీంతో వీరి ఆదాయం పెరుగుతుంది. చిరకాల కోరికలు నెరవేరుతాయి. కార్యాలయంలో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. డబ్బు అనేక విధాలుగా వస్తుంది. ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం ఉంటుంది. మంచి పురోగతిని చూస్తారు.
(4 / 5)
తులారాశికి 6వ ఇంట్లో శని రాహువు సంయోగం జరుగుతుంది. ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలన్నీ తీరతాయి. శత్రువులను ఓడించి విజయం సాధిస్తారు. శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వివాదాస్పద విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.
ఇతర గ్యాలరీలు