Sankranthi Muggulu: సంక్రాంతి స్పెషల్ రంగోలీ డిజైన్స్ కోసం వెతుకుతున్నారా..? ఇవైతే సింపుల్‌గా సూపర్‌గా ఉంటాయి
- Sankranthi Muggulu: సంక్రాంతి పండుగంటేనే ముగ్గులు వాటి మధ్యలో గొబ్బెమ్మల. ఈ పండుగకు మీరు కూడా మీ ఇంటి ముందు ప్రత్యేకమైన, అందమైన డిజైన్ వేసి మధ్యలో పూలు, గొబ్బెమ్మలతో అలంకరించాలనుకుంటే ఇక్కడ కొన్ని వెరైటీ ముగ్గులు ఉన్నాయి. ఇవి మీకు కచ్చితంగా నచ్చుతాయి. ఇంటి వేసినా కూడా అందంగా ఉంటుంది.

(1 / 7)
రకరకాల పువ్వులు, ఆకులతో నిండుగా కనిపిస్తున్న ఈ ముగ్గు డిజైన్ సంక్రాంతి పండుగ నాడు గానీ, భోగి నాడు గానీ మీ ఇంటి ముందు వేశాంటే చాలా అందంగా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ భలే ఉంది అంటారు.
(2 / 7)
చెరుకు గడలు, కుండ, పొంగుతున్న పాలు వంటి సంక్రాంతి పండుగ ప్రత్యేకతలన్నీ కలగలిపి ఉన్న ఈ డిజైన్ సంక్రాంతి పండుగ రోజున మీ ఇంటి ముందు వేసుకోవచ్చు.
(3 / 7)
మీ ఇంట్లో పిల్లలు ఉండి, వాళ్ల కోసం కూడా ముగ్గు కావాలని అడుగుతుంటే ఈ డిజైన్ మీకు ఉపయోగపడుతుంది. మీరు వేస్తున్న పెద్ద ముగ్గుకు పక్కనే ఈ డిజైన్ వేసి మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్‌కు బదులుగా హ్యాపీ సంక్రాంతి అని రాయండి. వీలైతే వారినే రంగులు నింపమనండి. పిల్లలు చాలా చాలా మురిసిపోతారు.
(4 / 7)
చిన్న చిన్న తామరపువ్వులు, శంఖు పువ్వులు కలిసి ఉన్న ఈ డిజైన్ చాలా సింపుల్ సూపర్ గా అనిపిస్తుంది. ఇది పండుగ రోజున మీ ఇంటి ముందు వేసి హ్యాపీ న్యూ ఇయర్ స్థానంలో హ్యాపీ పొంగల్ అని రాసేయండి.
(5 / 7)
తామర పువ్వులతో స్వాగతం పలుకుతున్నట్లుగా కనిపిస్తున్న ఈ ముగ్గు పండుగ రోజున మీ ఇంటి ముందు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేయడం కూాడా చాలా సులువు.
(6 / 7)
ఇంటి ముందు పెద్దగా స్థలం లేని వారు, సింపుల్‌గా, అందంగా ముగ్గు వేయాలనుకునే వారికి ఈ ముగ్గు బెస్ట్ ఛాయిస్. ఇందులో హ్యాపీ న్యూ ఇయర్ స్థానంలో సంక్రాంతి శుభాకాంక్షలు అని చక్కగా తెలుగులో రాసుకోండి బాగుంటుంది.
ఇతర గ్యాలరీలు