Hyderabad : సంక్రాంతి వేళ భారీగా ప్రయాణికుల రద్దీ..! హైదరాబాద్ - విజయవాడ హైవేపై వాహనాల బారులు-sankranti rush leads to traffic jam on hyderabad vijayawada highway ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyderabad : సంక్రాంతి వేళ భారీగా ప్రయాణికుల రద్దీ..! హైదరాబాద్ - విజయవాడ హైవేపై వాహనాల బారులు

Hyderabad : సంక్రాంతి వేళ భారీగా ప్రయాణికుల రద్దీ..! హైదరాబాద్ - విజయవాడ హైవేపై వాహనాల బారులు

Jan 11, 2025, 07:14 AM IST Maheshwaram Mahendra Chary
Jan 11, 2025, 07:14 AM , IST

  • Sankranti rush in Hyderabad : సంక్రాంతి వేళ నగరవాసులు పల్లెలకు తరలివెళ్తున్నారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచే జనాలతో నగరమంతా కిక్కిరిసిపోయింది. ఎటుచూసినా ప్రయాణికుల రద్దీనే కనిపిస్తోంది. వాహనాల రద్దీతో చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు హైదరాబాద్ - విజయవాడ హైవేపై వాహనాలు బారులు తీరాయి.

సంక్రాంతి సెలవులతో హైదరాబాద్ నగరమంతా ఖాళీ అవుతోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచే చాలా మంది ప్రజలు సొంతూళ్లకు బయల్దేరారు.  దీంతో నగరంలోని పలు జంక్షన్ల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 

(1 / 6)

హైదరాబాద్ నగరంలో ఎటుచూసినా ప్రయాణికుల రద్దీనే కనిపిస్తోంది. వాహనాల రద్దీతో చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా ఎల్బీ నగర్, ఉప్పల్ జంక్షన్ లో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో పాటు ఇతర వాహనాల్లో ప్రయాణికులు భారీగా వెళ్తున్నారు.

(2 / 6)

ఎల్బీ నగర్ నుంచి భారీగా వాహనాలు వెళ్తుండటంతో హైదరాబాద్ - విజయవాడ హైవే వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఎల్బీ నగర్ నుంచి చౌటుప్పల్ వరకు ఇదే పరిస్థితి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు, రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతన్నాయి.

(3 / 6)

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగుతోంది. హైదరాబాద్ నుండి విజయవాడవైపు వేలాది వాహనాలు వెళ్తున్నాయి. విజయవాడకు వెళ్లే దారిలో పది టోల్ బూతులను ఓపెన్ చేశారు. టోల్ గేట్ల వద్ద కూడా తగిన జాగ్రత్తలు చేపట్టారు. 

(4 / 6)

పంతంగి వద్ద ఉన్న టోల్ ప్లాజానే కాకుండా… కొర్లపహాడ్ (కేతేపల్లి) టోల్ గేట్ వద్ద కూడా ట్రాఫిక్ జామ్ అవుతోంది. సంక్రాంతి పండుగ రద్దీ సందర్భంగా హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, పోలీసు అధికారుల సూచనలతో టోల్ ప్లాజాల వద్ద, ప్రధాన పట్టణాల్లో రద్దీ నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రమాదాల నివారణకు లైటింగ్, సైన్‌ బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు చేపట్టారు. రేడియం స్టిక్కర్లతో కూడిన రోడ్‌ మార్జిన్‌ మార్కింగ్‌లూ వేశారు. హైవేపై ట్రాఫిక్ లేకుండా నియంత్రించేందుకు ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటు చేశారు.

(5 / 6)

 ప్రయాణికుల రద్దీతో  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కిటకిట లాడుతుంది. సంక్రాంతి వేళ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకవచ్చినప్పటికీ…. ప్రయాణికుల రద్దీ భారీగా కనిపిస్తోంది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రైల్వేశాఖ ఏర్పాట్లు చేసింది. స్టేషన్ల వద్ద ప్రొటెక్షన్ కూడా పెంచింది.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు