తెలుగు న్యూస్ / ఫోటో /
Sankranti Pandem Kollu : ఆన్‌లైన్‌లో కాలు దువ్వుతున్న పందెం కోళ్లు.. వీటికి మహా డిమాండ్ గురూ!
- Sankranti Pandem Kollu : సంక్రాంతి.. ఈ పండగ ఏపీలో చాలా స్పెషల్. దానికి కారణం పందెం కోళ్లు. అవును.. కోడి పందేలు చూడాలంటే గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిందే. ఈ సీజన్‌లో పందెం కోళ్లకు చాలా డిమాండ్ ఉంటుంది. ఇటు పందెం రాయుళ్ల అభిరుచికి తగ్గట్టు కోళ్ల పెంపకందారులు అప్‌డేట్ అయ్యారు.
- Sankranti Pandem Kollu : సంక్రాంతి.. ఈ పండగ ఏపీలో చాలా స్పెషల్. దానికి కారణం పందెం కోళ్లు. అవును.. కోడి పందేలు చూడాలంటే గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిందే. ఈ సీజన్‌లో పందెం కోళ్లకు చాలా డిమాండ్ ఉంటుంది. ఇటు పందెం రాయుళ్ల అభిరుచికి తగ్గట్టు కోళ్ల పెంపకందారులు అప్‌డేట్ అయ్యారు.
(1 / 8)
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఏపీలో సందడి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. ఈసారి కూడా పందేలు జోరుగా సాగే అవకాశం ఉంది. (HT Telugu)
(2 / 8)
సంక్రాంతి పండగ సమీస్తున్న నేపథ్యంలో.. పందెం కోళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇప్పటి నుంచే పందెం కోళ్ల కోసం పందెం రాయుళ్లు వెతుకుతున్నారు. (HT Telugu)
(3 / 8)
పందెం రాయుళ్ల కోసం కోళ్ల పెంపకందారులు వెసులుబాటు కల్పిస్తున్నారు. కోళ్లను పెంచే చోటుకు రాకుండానే డోర్ డెలివరీ చేస్తున్నారు. అవును ఇప్పుడు పందెం కోళ్లను ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచుతున్నారు. (HT Telugu)
(4 / 8)
పెంపకందారులు కోళ్ల ఫొటోలను వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. వాటిని చూసిన వారు తమకు కావాల్సిన వాటిని ఎంపిక చేసుకొని డబ్బులు చెల్లిస్తే.. కోళ్లను వారికి పంపిస్తున్నారు.(HT Telugu)
(5 / 8)
ప్రస్తుతం పెరూ, ఇండియన్ బ్రీడ్ రన్నింగ్‌లో ఉంది. ఎక్కువ డిమాండ్ వీటికే ఉంది. ఒక్కో కోడి పుంజుకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ధర ఉంటోంది. (HT Telugu)
(6 / 8)
ఈ పెందెం కోళ్లకు ప్రత్యేకించి శిక్షణ ఇస్తారు. ఇందు కోసం కుర్రాళ్లను నియమిస్తారు. వీటిని ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు తీసుకెళ్తారు. వేడినీళ్లతో పోతలు (స్నానాలు) చేయిస్తారు.(HT Telugu)
(7 / 8)
ఈ పందెం కోళ్లు స్ట్రాంగ్ అవ్వడానికి స్విమ్మింగ్ కూడా చేపిస్తారు. గ్యాస్ పోయ్యి మీద ఇత్తడి పళ్లెం పెట్టి శాకాలు తీస్తారు (వేడి గుడ్డతో అద్దుతారు). (HT Telugu)
(8 / 8)
గోదావరి జిల్లాలో పందెం కోళ్లను ఎక్కువ పెంచుతున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం వెంకటాపురం గ్రామంలో పామాయిల్ తోటల్లో పెంచుతున్నారు. పందెం కోళ్ల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కొప్పుల నాగు అనే పెంపకందారు వివరించారు. ఒక్కో కోడి పెంపకానికి దాదాపు రూ.25 వేలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు.(HT Telugu)
ఇతర గ్యాలరీలు