AP Sankranti Holidays 2025 : ఏపీలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చేసింది - ఈసారి ఎన్ని రోజులంటే..?-sankranti holidays will be given from january 10 in andhrapradesh latest updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Sankranti Holidays 2025 : ఏపీలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చేసింది - ఈసారి ఎన్ని రోజులంటే..?

AP Sankranti Holidays 2025 : ఏపీలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చేసింది - ఈసారి ఎన్ని రోజులంటే..?

Dec 27, 2024, 10:43 PM IST Maheshwaram Mahendra Chary
Dec 27, 2024, 07:25 PM , IST

  • AP Sankranti Holidays 2025 : ఏపీలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చేసింది.  రాష్ట్రంలోని అ్ని పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్టు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకులు కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సెలవులు తగ్గించే యోచన లేదని స్పష్టం చేశారు. 

ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల్లో మార్పులు ఉంటాయన్న వార్తలపై క్లారిటీ వచ్చేసింది. సెలవులను కుదించే యోచన లేదని ఏపీ విద్యాశాఖ స్పష్టం చేసింది.

(1 / 7)

ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల్లో మార్పులు ఉంటాయన్న వార్తలపై క్లారిటీ వచ్చేసింది. సెలవులను కుదించే యోచన లేదని ఏపీ విద్యాశాఖ స్పష్టం చేసింది.(istockphoto)

జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి పండగ సెలవులు ఇస్తున్నట్లు  ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి తెలిపారు.  అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులు ఉంటాయని తాజాగా ఆయన స్పష్టం చేశారు. 

(2 / 7)

జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి పండగ సెలవులు ఇస్తున్నట్లు  ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి తెలిపారు.  అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులు ఉంటాయని తాజాగా ఆయన స్పష్టం చేశారు. (istockphoto)

ఏపీలో ఇటీవల భారీ వర్షాలతో పలు జిల్లాల్లో స్కూళ్లు,కాలేజీలకు కలెక్టర్లు వరుసగా సెలవులు ఇచ్చారు. దీంతో విద్యాసంవత్సం పనిదినాలు తగ్గుతున్నాయి.  దీంతో పనిదినాలు తగ్గకుండా ఉండేందుకు సంక్రాంతి సెలవులు కుదిస్తారని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే… విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.

(3 / 7)

సంక్రాంతి సెలవుల కుదింపుపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న  ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు సూచించారు.

(4 / 7)

సంక్రాంతి సెలవుల కుదింపుపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న  ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు సూచించారు.(image source from unsplash.com)

వచ్చే ఏడాది 23 సాధారణ సెలవులు

(5 / 7)

వచ్చే ఏడాది 23 సాధారణ సెలవులు

మరోవైపు వచ్చే సంవత్సరం 2025కు సాధారణ, ఆప్షనల్ సెలవులను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వచ్చే ఏడాదిలో మొత్తం 23 సాధారణ సెలవులు ఉంటాయని పేర్కొంది. ఇక 21 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు త్తర్వుల్లో తెలిపింది. 

(6 / 7)

ఇక వచ్చిన సాధారణ సెలవుల్లోనూ రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం ఆదివారం తేదీల్లో వచ్చాయి. ఇక ఐచ్ఛిక సెలవుల్లో ఈద్‌-ఎ-గదిర్, మహాలయ అమావాస్య కూడా ఆదివారం వచ్చాయి. అయితే జనవరి, ఏప్రిల్, ఆగస్టు మాసాల్లో మాత్రం నాలుగేసి రోజులు హాలీ డేస్ వచ్చాయి. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు