(1 / 5)
ఐపీఎల్ 2024 టోర్నీలో గుజరాత్ టైటాన్స్ (GT)తో నేటి మ్యాచ్‍లో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటింగ్‍లో దుమ్మురేపింది. జైపూర్ వేదికగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్, యంగ్ స్టార్ రియాన్ పరాగ్ మెరుపు అర్ధ శతకాలతో అదరగొట్టారు.
(AP)(2 / 5)
ఈ మ్యాచ్‍లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ 38 బంతుల్లోనే 68 పరుగులతో (నాటౌట్) అదరగొట్టాడు. 7 ఫోర్లు, 2 సిక్సర్లతో మెరిపించాడు. గుజరాత్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. చివరి వరకు నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఈ 2024 సీజన్‍లో సంజూకు ఇది మూడో అర్ధ శతకంగా ఉంది.
(PTI)(3 / 5)
యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ కూడా ఈ మ్యాచ్‍లో విజృంభించాడు. 48 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 పరుగులతో మెప్పించాడు.
(PTI)(4 / 5)
ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఓ దశలో 8 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 52 పరుగుల వద్ద నిలిచింది. ఆ తర్వాత సంజూ శాంసన్, రియాన్ పరాగ్ ధనాధన్ బ్యాటింగ్‍తో దుమ్మురేపారు. దీంతో ఆ తర్వాతి చివరి 12 ఓవర్లలో రాజస్థాన్ 144 పరుగులను సాధించింది.
(PTI)(5 / 5)
శాంసన్, పరాగ్ మెరుపులతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ టైటాన్స్ ముందు 197 పరుగుల లక్ష్యం ఉంది.
(AP)ఇతర గ్యాలరీలు