(1 / 5)
ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ అయిన ఈ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్06 స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్ఓసీ ప్రాసెసర్ కూడా ఉంటుంది. 4జీబీ, 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్ ఉంది.
(2 / 5)
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ప్రీ- ఇన్స్టాల్డ్ వన్ యూఐ 7.0 సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్‌లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆప్షన్ ఉండటం చాలా అరుదు. 4ఏళ్ల ఓఎస్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్గ్రేడ్స్కి శాంసంగ్ హామీ ఇచ్చింది.
(3 / 5)
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్06 రేర్‌లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ కెమెరా సెటప్ ఉంటుంది. ఇక సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఈ మోడల్లో 8ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఇచ్చారు.
(4 / 5)
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనికి 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అంతేకాదు, ఈ మొబైల్ 12 5జీ బ్యాండ్స్‌ని సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ నాక్స్ వాల్ట్, వాయిస్ ఫోకస్, క్విక్ షేర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి సేఫ్టీ, కన్వీనియెన్స్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
(5 / 5)
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్06 ప్రారంభ ధర రూ. 9,499గా ఉంది.
ఇతర గ్యాలరీలు