బడ్జెట్​ రూ. 10వేలు- శాంసంగ్​ వర్సెస్​ మోటోరోలా.. ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?-samsung galaxy f06 5g vs moto g35 5g which budget smartphone you should buy ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  బడ్జెట్​ రూ. 10వేలు- శాంసంగ్​ వర్సెస్​ మోటోరోలా.. ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

బడ్జెట్​ రూ. 10వేలు- శాంసంగ్​ వర్సెస్​ మోటోరోలా.. ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Published Feb 16, 2025 10:29 AM IST Sharath Chitturi
Published Feb 16, 2025 10:29 AM IST

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 06 5జీ భారతదేశంలో లాంచ్ అయ్యింది. ఇదే ప్రైజ్​ రేంజ్​లో ఉన్న మోటో జీ35 5జీకి ఇప్పటికే మంచి డిమాండ్​ ఉంది. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్​? ఇక్కడ చూసేయండి..

డిజైన్: శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 06 5జీ కొత్త, ప్రత్యేకమైన డిజైన్​తో వస్తుంది, దీనిని కంపెనీ "రిపుల్ గ్లో" ఎఫెక్ట్ అని పిలుస్తోంది. ఇది రూ.10,000 లోపు విలువైన డిజైన్​ను కలిగి ఉంది. మరోవైపు, మోటో జీ35 5జీ వెజిటేరియన్​ లెధర్ బ్యాక్ ప్యానెల్​తో కూడిన సూక్ష్మమైన డిజైన్​తో వస్తుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఈ స్మార్ట్​ఫోన్ ఐపీ52 రేటింగ్​తో వస్తుంది.

(1 / 5)

(Samsung)

డిస్​ప్లే: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్06 5జీలో 6.7 ఇంచ్​ హెచ్​డీ+ ఎల్​సీడీ డిస్​ప్లే, హై బ్రైట్​నెస్​ మోడ్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. మోటో జీ35 5జీ స్మార్ట్​ఫోన్​ 6.72 ఇంచ్​ ఐపీఎస్ ఎల్సీడీ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అందువల్ల, ఇది గెలాక్సీ ఎఫ్ 06 5జీ కంటే ఎక్కువ టచ్-రెస్పాన్సిబుల్!

(2 / 5)

(Aishwarya Panda/ HT Tech)

పర్ఫార్మెన్స్​: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్06 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. మోటో జీ35 5జీ స్మార్ట్​ఫోన్​లో యూనిసోక్ టీ760 ప్రాసెసర్, 4 జీబీ, 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్​ పరంగా శాంసంగ్ మరింత శక్తివంతమైనది.

(3 / 5)

కెమెరా: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 06 5జీలో డ్యూయల్ రేర్ కెమెరా సెటప్​ ఉంది, ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. మరోవైపు, మోటో జీ35 5జీ డ్యూయల్ కెమెరా వ్యవస్థతో వస్తుంది, ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. ముందువైపు శాంసంగ్ 8 మెగాపిక్సెల్, మోటో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందిస్తున్నాయి.

(4 / 5)

బ్యాటరీ: గెలాక్సీ ఎఫ్06 5జీలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మోటో జీ35లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 

(5 / 5)

బ్యాటరీ: గెలాక్సీ ఎఫ్06 5జీలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మోటో జీ35లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. (Aishwarya Panda/ HT Tech)

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు