(1 / 8)
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన న్యూ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తూ ఉంటుంది.
(Instagram/Samantha)(2 / 8)
తాజాగా ఇవాళ (జూన్ 29) సమంత లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. వాటిలో సమంత చేసే డైలీ రొటీన్ పనులకు సంబంధించిన ఫొటోలు ఉన్నాయి.
(Instagram/Samantha)(3 / 8)
నెగెటివ్ కంట్రోల్ థెరపీ అంటూ ఓ ఫొటో షేర్ చేసింది బ్యూటిఫుల్ సమంత. ఓ ఎలాక్ట్రానిక్ పరికరంపై కూర్చుని సమంత స్మైల్ చేసింది. అది స్ట్రెస్ హీల్ మేషిన్‌లా కనిపిస్తోంది.
(Instagram/Samantha)(4 / 8)
ఇదే క్రమంలో మహానటి కీర్తి సురేష్‌తో దిగిన ఫొటోను కూడా సమంత షేర్ చేసింది. ఈ ఫొటోలో ఇద్దరు డైనింగ్ టేబుల్‌పై నవ్వుతూ పోజు ఇచ్చారు. లంచ్ కోసం సాయంత్రం కూర్చున్నాం అని సమంత ఆ ఫొటోలో రాసుకొచ్చింది.
(Instagram/Samantha)(5 / 8)
సమంత రెగ్యులర్‌గా వర్కౌట్ చేస్తుందన్న విషయం తెలిసిందే. తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో సమంత మజిల్ బిల్డ్‌తో ఉంది. కండబలం చూపిస్తూ ఫొటో షేర్ చేసింది సామ్. పక్కన ఉండి జడ్జ్ చేయడం చాలా సులభం కానీ, అర్థం చేసుకోడానికి సమయం పడుతుంది అని ఆ ఫొటోలో రాసుకొచ్చింది సమంత.
(Instagram/Samantha)(6 / 8)
ఈ ఫొటోలతోపాటు గ్లామర్ పిక్‌ను కూడా పంచుకుంది సమంత. మెరూన్ కలర్ బాడీ కాన్ డ్రెస్సులో హాట్ షో చేసిన సమంత వెంటాడట్లేదు, ఎంచుకుంటున్నాను అని రాసుకొచ్చింది.
(Instagram/Samantha)(7 / 8)
ఈ ఫొటోలన్నింటిని ఇవాళ షేర్ చేసిన సమంత “మనం ఏది మాట్లాడటాన్ని ఎంచుకుంటామో మనం అలాగే తయారవుతాం” అని క్యాప్షన్ రాసుకొచ్చింది.
(Instagram/Samantha)(8 / 8)
గార్డెన్‌లో కూర్చుని ఏదో తింటూ పోజు ఇచ్చిన సమంత రియాలిటీ మధ్యలో పట్టుబడిపోయాను అని ఫొటోలో రాసుకొచ్చింది. వీటితోపాటు కొన్ని బుక్స్ తదితర ఫొటోలను షేర్ చేసింది సమంత.
(Instagram/Samantha)ఇతర గ్యాలరీలు