(1 / 7)
స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారిన సినిమా శుభం. దక్షిణాదిలో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న సమంత రూత్ ప్రభు ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా మారింది.
(2 / 7)
ట్రాలాల మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన శుభం సినిమాకు హీరోయిన్ సమంత నిర్మాతగా వ్యవహరిస్తోంది. మే 9న థియేటర్లలో శుభం గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మే 4న శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో ఘనంగా నిర్వహించారు.
(3 / 7)
శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సమంత గ్లామర్‌తో అట్రాక్ట్ చేసింది. దీంతో సమంత రూత్ ప్రభు ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వైట్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకున్న సమంత ఫ్లవర్ ప్రింటెండ్ చీరలో తళుక్కుమంది.
(4 / 7)
శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అందాలతో అట్రాక్ట్ చేసిన సమంత స్టేజీపై డ్యాన్స్ చేసింది. శుభం సినిమాలోని పాటకు మూవీ నటీనటులుతో కలిసి చిందులేసింది సమంత రూత్ ప్రభు. దానికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.
(5 / 7)
అంతేకాకుండా శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా స్టేజీపైకి ఎక్కిన సమంత అభిమానులకు ఫ్లైయింగ్ కిస్సెస్ పెడుతూ ప్రేమను చాటుకుంది. వైజాగ్ ఆడియెన్స్, ఫ్యాన్స్‌కు నమస్కారం చేసింది.
(6 / 7)
అనంతరం తన స్పీచ్‌తో అలరించింది హీరోయిన్ సమంత. వైజాగ్‌కు తాను వచ్చిన ప్రతిసారి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని, ఇప్పుడు శుభం కూడా అంతే హిట్ అవుతుందని సమంత ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇతర గ్యాలరీలు