Samantha Birthday: హ్యాపీ బర్త్ డే సమంత.. మోడలింగ్ నుంచి ఇప్పటివరకు సామ్ ఎలా మారిందో చూశారా?
Samantha Birthday Special: స్టార్ హీరోయిన్ సమంత నేటితో (ఏప్రిల్ 28) 37వ వసంతంలోకి అడుగుపెడుతోంది. స్టూడెంట్‌గా ఉన్నప్పుడే మోడలింగ్‌లో రాణించిన సమంత 2010లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 14 ఏళ్ల సినీ కెరీల్‌లో మోడలింగ్ నుంచి ఇప్పటివరకు సమంత స్పెషల్ ఫొటోలపై లుక్కేద్దాం.
(1 / 11)
స్టార్ హీరోయిన్, పారిశ్రామికవేత్త సమంత రూత్ ప్రభు ఏప్రిల్ 28న 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమె పాత చిత్రాలను ఒకసారి పరిశీలిస్తే..
(X)(2 / 11)
ఒక స్టూడెంట్ గా తన అకడమిక్ ఎక్స్ లెన్స్ గురించి తరచూ ఇంటర్వ్యూల్లో పంచుకునే సమంత, నటనా ప్రపంచంలోకి ఊహించని విధంగా అడుగుపెట్టింది.
(X)(3 / 11)
ఇంట్లో ఆర్థిక పరిస్థితి కారణంగా జీవనోపాధి కోసం సమంత పాఠశాల, వృత్తి ద్వారా చిన్నచిన్న ఉద్యోగాలు చేసేది.
(X)(4 / 11)
సమంత 10 లేదా 11వ తరగతిలో ఉన్నప్పుడు ఎనిమిది గంటల షిఫ్ట్ కోసం ఒక కాన్ఫరెన్స్ లో హోస్టెస్ గా పని చేసింది. అందుకు రూ.500 జీతం అందుకున్నానని సమంత ఒకసారి వెల్లడించింది.
(X)(5 / 11)
కాలేజ్ లో ఉండగానే కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ వైపు మొగ్గు చూపినప్పటికీ.. ఎప్పుడూ చదువుపైనే దృష్టి పెట్టానని సమంత తరచూ ఇంటర్వ్యూల్లో వెల్లడిస్తుంటుంది.
(X)(6 / 11)
అయితే స్వదేశంలో పరిస్థితుల కారణంగా ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాలన్న తన కలను వదులుకుని సినిమాల్లోకి రాకముందే ఫుల్ టైమ్ మోడలింగ్ చేసింది సమంత.
(7 / 11)
దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ సమంతను సినిమాల్లోకి అడుగుపెట్టేలా చేసినట్లు తెలుస్తోంది. దాంతో సమంత డెస్టినీ మారిపోయింది.
(X)(8 / 11)
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తో మాస్కోఇన్ కావేరి మూవీ సమంత తొలి చిత్రం. ఇందులో దర్శకుడు ఆమెకు ఒక పాత్రను ఆఫర్ చేశాడు, కానీ, ఈ సినిమా కంటే ముందు ఏ మాయ చేశావే విడుదలైంది. దాంతో సమంత తొలి సినిమాగా ఏ మాయ చేశావే నిలిచింది.
(X)(9 / 11)
2010లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఏ మాయ చేసావే సినిమాతో తెరంగేట్రం చేసిన సమంత అక్కడ తన మాజీ భర్త నాగచైతన్యతో జోడీ కట్టింది. ఆ తర్వాత తన సినీ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
(X)(10 / 11)
పక్కింటి అందమైన అమ్మాయిగా నటించి మెప్పించిన సమంత రంగస్థలం, సూపర్ డీలక్స్, ది ఫ్యామిలీ మ్యాన్ 2, యశోద వంటి చిత్రాల్లో స్టీరియోటైప్స్ ను బ్రేక్ చేసింది.
(X)ఇతర గ్యాలరీలు