Salt less Eating: ఉప్పు తక్కువగా తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?
Salt less Eating: రుచికి సరిపడ ఉప్పు కావాలనుకోవడం కాదు. ఉప్పు తక్కువగా తినడం వల్లనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. చర్మ ఆరోగ్యంతో పాటు గుండె, కిడ్నీలు కూడా మెరుగ్గా పనిచేస్తాయట.
(1 / 6)
కూరలోనే, మరేదైనా ప్రత్యేక వంటకంలోనో ఉప్పు కాస్త తగ్గిందంటే విసిగిపోతాం. ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. అలాంటి వాళ్లకు కూరలో ఉప్పు తగ్గడం అనేది మీ ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిస్తే, కోపానికి బదులు ఆరోగ్యకరమైన ఆహారం తిన్నామనే సంతృప్తి మిగులుతుంది. అదెలాగో చూద్దామా..
(pixabay)(2 / 6)
మెరుపు తగ్గిపోవడం: ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి ఉత్పత్తి పెరగడాన్ని అడ్డుకుంటుంది. దాంతో ఆక్సిజన్, పోషకాలు చర్మానికి తక్కువగా అందుతాయి. ఇది చర్మాన్ని పొడిగానూ లేదా జిడ్డుగానూ మార్చేస్తాయి. ఉప్పు తక్కువగా తీసుకుంటే, శరీరానికి నీరు సమానంగా అంది, చర్మాన్ని శుభ్రంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది.
(pixabay)(3 / 6)
గుండె, కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడటం: ఉప్పు తక్కువగా తీసుకుంటే, గుండె జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు. ఎక్కువ ఉప్పు కిడ్నీలపై ఒత్తిడి పెడుతుంది. కిడ్నీ సక్రమంగా పనిచేయడానికి ఉప్పు తక్కువగా తీసుకోవాలి.
(pixabay)(4 / 6)
సహజమైన చర్మాన్ని కాపాడుకోవడం: ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి తేమ తగ్గి చర్మం పొడిబారుతుంది. ముడతలు రావడం వంటి సమస్యలు కలుగుతాయి. తక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తగ్గిపోతాయి.
(pixabay)(5 / 6)
వృద్ధాప్య లక్షణాలు తగ్గడం: ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి, చర్మం మీద ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల ఈ చర్మం కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది.
(Pixabay)ఇతర గ్యాలరీలు