ఆ హీరోయిన్ కోసం ఈ ఇద్దరు హీరోల కొట్లాట.. ఈ హీరో లవర్‌తో ఆ హీరోకు ఎఫైర్.. మాజీ క్రికెటర్ భార్య ఆమె-salman khan lover sangeetha bijlani affair with jackie shroff bollywood actor fight for a heroine ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఆ హీరోయిన్ కోసం ఈ ఇద్దరు హీరోల కొట్లాట.. ఈ హీరో లవర్‌తో ఆ హీరోకు ఎఫైర్.. మాజీ క్రికెటర్ భార్య ఆమె

ఆ హీరోయిన్ కోసం ఈ ఇద్దరు హీరోల కొట్లాట.. ఈ హీరో లవర్‌తో ఆ హీరోకు ఎఫైర్.. మాజీ క్రికెటర్ భార్య ఆమె

Published Oct 06, 2025 05:35 PM IST Hari Prasad S
Published Oct 06, 2025 05:35 PM IST

ఓ హీరోయిన్ కోసం ఇద్దరు టాప్ హీరోలు కొట్లాడుకున్నారన్న విషయం తెలుసా? ఓ హీరో లవర్ తో మరో హీరోకు ఎఫైర్ ఉందన్న వార్తలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాయి. ఆ హీరోలు ఎవరో కాదు సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్.

బాలీవుడ్ 90వ దశకం ప్రారంభంలో జాకీ ష్రాఫ్ పెద్ద స్టార్ గా ఉండగా, సల్మాన్ ఖాన్ స్టార్ గా మారుతున్నాడు. ఈ సమయంలో సల్మాన్, నటి సంగీతా బిజ్లానీ ఎఫైర్ గురించి కూడా వార్తలు వచ్చాయి.

(1 / 7)

సల్మాన్, సంగీత ఏళ్ల తరబడి డేటింగ్ చేశారు. పెళ్లి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ అకస్మాత్తుగా వీళ్లు విడిపోయారు.

(2 / 7)

సంగీతతో సల్మాన్ డేటింగ్ చేస్తున్న సమయంలోనే అతనిని ఓ వార్త షాక్ కు గురి చేసింది. సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ తన స్నేహితుడు, నటుడు అయిన జాకీ ష్రాఫ్ తో ఎఫైర్ ఉన్నట్లు అతనికి తెలిసింది.

(3 / 7)

ఇజ్జత్ సినిమా షూటింగ్ సమయంలో జాకీ, సంగీత్ ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తతో సల్మాన్ ఖాన్ బాధపడ్డాడు. జాకీకి దూరంగా ఉన్నాడు.

(4 / 7)

ఐఎండీబీ ప్రకారం కాస్ట్యూమ్ డిజైనర్ అన్నా సింగ్.. జాకీ, సంగీత ఎఫైర్ గురించి సల్మాన్ కు సమాచారం ఇచ్చారు. ఈ వార్త ఇద్దరు నటుల మధ్య చాలా దూరాన్ని సృష్టించింది, సల్మాన్ ఏళ్ల తరబడి నటుడితో ఏ సినిమా చేయలేదు.

(5 / 7)

అయితే సంగీత-జాకీ గురించి వ్యాపించిన వార్తలు అబద్ధమని తేలడంతో ఇద్దరి మధ్య సంబంధాలు మళ్లీ బాగుపడ్డాయి. జాకీతో బంధన్ అనే సినిమా కూడా సల్మాన్ చేశాడు.

(6 / 7)

1998లో వచ్చిన బంధన్ సినిమాలో జాకీ.. సల్మాన్ ఖాన్ బావమరిది పాత్రలో నటించాడు. ఈ సినిమా సక్సెస్ అయింది. ఇక సంగీతా బిజ్లానీ ఆ తర్వాత సల్మాన్ తోనూ విడిపోయి టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 1996లో వీళ్లు పెళ్లి చేసుకోగా.. 2010లో విడిపోయారు.

(7 / 7)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు