(1 / 5)
సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్ర పోషించిన సైంధవ్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. హిట్ సినిమాల ఫేమ్ డైరెక్టర్ శైలేశ్ కొలను.. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దర్శకత్వం వహించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు సైంధవ్ రానుంది.
(2 / 5)
సైంధవ్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డేట్, టైమ్ ఖరారయ్యాయి. జనవరి 3వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ మొదలుకానుంది.
(3 / 5)
హైదరాబాద్‍లోని బంజారాహిల్స్ పీవీఆర్ ఆర్కే సినీప్లెక్స్ థియేటర్లో సైంధవ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ వివరాలను మూవీ యూనిట్ నేడు కొత్త సంవత్సరం రోజు (జనవరి 1) సందర్భంగా ప్రకటించింది.
(4 / 5)
సైంధవ్ సినిమాలో వెంకటేశ్‍కు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, జిషు సెంగూప్త ఈ మూవీలో కీలకపాత్రలు చేశారు.
(5 / 5)
చాలా కాలం తర్వాత యాక్షన్ మూవీని వెంకటేశ్ చేస్తుండటంతో సైంధవ్‍కు చాలా క్రేజ్ ఉంది. తండ్రీ,కూతుళ్ల సెంటిమెంట్ కూడా ఈ మూవీలో ప్రధానంగా ఉండనుంది. నిహారిక ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.
ఇతర గ్యాలరీలు