Salvia Officinalis: సర్వరోగ నివారిణి సేజ్, హెర్బల్ మొక్కల్లో తిరుగులేని సల్వియా అఫిసినాలిస్…
- Salvia Officinalis: ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే సేజ్ ఆకులను శతాబ్దాలుగా మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. దీని పేరులోనే రోగనివారిణి అనే అర్థం ఇమిడి ఉంటుంది. హెర్బల్ మూలికల్లో దీనిని సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు. ఇందులో పోషకపదార్ధాలు కూడా మెండుగా ఉంటాయి.
- Salvia Officinalis: ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే సేజ్ ఆకులను శతాబ్దాలుగా మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. దీని పేరులోనే రోగనివారిణి అనే అర్థం ఇమిడి ఉంటుంది. హెర్బల్ మూలికల్లో దీనిని సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు. ఇందులో పోషకపదార్ధాలు కూడా మెండుగా ఉంటాయి.
(1 / 10)
మనుషులకు రకరకాల కారణాలతో సంక్రమించే అన్ని రకాల వ్యాధులను నిరోధించే శక్తి సేజ్ లేదా సల్వియా అఫిసినాలిస్ కు ఉంది. దీని పేరులోనే సల్వియా అంటే రోగ నివారిని అనే అర్ధం ఇమిడి ఉంది.
(2 / 10)
సేజ్‌లో కార్బో హైడ్రేట్స్, ప్రొటీన్స్, కొవ్వు, ఫైబర్, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, జింక్, కాపార్, మాంగనీస్, ఐరన్, విటమిన్ ఏ, బి6, విటమిన్ సి, విటమిన్ ఇ, కెలు ఉంటాయి.
(3 / 10)
రీరంలో వేడి, నొప్పులను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సేజ్ ఆకుల్లో ఉన్నాయి. అంతేకాదు వీటిలో యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల మనం ఈ ఆకుల్ని వాడితే.. మనకు క్యాన్సర్, ఇతర రోగాలు వచ్చే అవకాశాలు తక్కువ. కణాలను ఇవి బాగా కాపాడతాయి.
(4 / 10)
మహిళల్లో మెనోపాజ్ దశ వారికి పెద్ద సమస్య. ఈ దశలో వారికి అన్ని రకాలుగా మేలు చేసే గుణాలు సేజ్ ఆకుల్లో ఉన్నాయి. అందువల్ల మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు ఈ ఆకులను వాడటం చాలా మేలు చేస్తుంది.
(5 / 10)
డయాబెటిస్ నియంత్రణలో సేజ్ సమర్ధవంతంగా పనిచేస్తుంది. సేజ్ టీ ఇచ్చిన వారిలో గ్లూకోజ్ అదుపులోకి వచ్చినట్టు పరిశోధనలు వెల్లడించాయి. మెట్‌ఫార్మిన్ తరహాలో సేజ్ ఆకులు పనిచేస్తున్నట్టు పోర్చ్‌గీస్ పరిశోధనలు వెల్లడించాయి.
(6 / 10)
సేజ్ సర్వరోగ నివారిణిగా గుర్తింపు పొందింది. నాలుగు వారాల పాటు సేజ్ టీ తీసుకున్న వారిలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాలు తగ్గడంతో పాటు గ్లూకోజ్ కూడా అదుపులోకి వచ్చినట్టు గుర్తించారు. హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచడంలో కూడా ఇది ఉపయోగపడుతున్నట్టు ఇంటర్నేషనల్ జర్నల్స్‌లో ప్రచురించారు.
(7 / 10)
జీర్ణాశయ సమస్యలు ఉన్నవారికి, జీర్ణశక్తి లోపించిన వారికి ఈ ఆకులు బాగా ఉపయోగపడతాయి. ఆకలి, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, కడుపులో మంట, నీళ్ల విరోచనాలకు ఔషధంగా పనిచేస్తుంది.
(8 / 10)
గొంతు నొప్పి, నోరు నొప్పితో బాధపడే వారితో పాటు నోటిలో ఏర్పడిన పుండ్లను, చిగుళ్ల నుంచి రక్తం కారడాన్ని సేజ్ నివారిస్తుంది. గొంతు నొప్పితో బాధపడే వారికి సేజ్ స్ప్రే చక్కటి ఉపశమనం కలిగిస్తుంది.
(9 / 10)
సేజ్ ఆకుల్ని తినడం ద్వారా మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థ బలపడి పక్షవాతం లక్షణాలను నివారిస్తుంది. చేతులు కాళ్లలో వణుకును అరికడుతుంది. వృద్ధుల్లో సన్నగిల్లే జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మతిమరుపు, అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
ఇతర గ్యాలరీలు