Sachin Tendulkar: 51 ఏళ్ల వయసు.. 33 బంతుల్లో 64 పరుగులు.. సచిన్ విధ్వంసం.. మామూలు బ్యాటింగ్ కాదు-sachin tendulkar blistering knock in international masters league india masters vs australia masters ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sachin Tendulkar: 51 ఏళ్ల వయసు.. 33 బంతుల్లో 64 పరుగులు.. సచిన్ విధ్వంసం.. మామూలు బ్యాటింగ్ కాదు

Sachin Tendulkar: 51 ఏళ్ల వయసు.. 33 బంతుల్లో 64 పరుగులు.. సచిన్ విధ్వంసం.. మామూలు బ్యాటింగ్ కాదు

Published Mar 05, 2025 11:00 PM IST Chandu Shanigarapu
Published Mar 05, 2025 11:00 PM IST

  • Sachin Tendulkar: 51 ఏళ్ల వయసులోనూ సచిన్ టెండుల్కర్ బ్యాటింగ్ కు వారెవా అనాల్సిందే. ఏజ్ కేవలం నంబర్ మాత్రమే అని చాటుతూ.. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో సచిన్ రెచ్చిపోయాడు. ఆస్ట్రేలియా మాస్టర్స్ తో మ్యాచ్ లో విధ్వంసం నమోదు చేశాడు. 

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆరంభ సీజన్ 2025లో ఇండియా మాస్టర్స్ కు సచిన్ కెప్టెన్. 51 ఏళ్ల వయసులోనూ సచిన్ బ్యాటింగ్ లో అదరగొడుతున్నాడు. తన స్టైల్లో స్ట్రెయిట్ డ్రైవ్, కవర్ డ్రైవ్ లు ఆడేస్తూ అభిమానులకు కిక్కిస్తున్నాడు. 

(1 / 5)

(PTI)

బుధవారం (మార్చి 5) ఆస్ట్రేలియా మాస్టర్స్ తో మ్యాచ్ లో ఇండియా మాస్టర్స్ కెప్టెన్ సచిన్ చెలరేగిపోయాడు. 33 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. అతని స్ట్రైక్ రేట్ 193.94 కావడం విశేషం. 

(2 / 5)

వడోదర లో జరిగిన ఈ మ్యాచ్ లో సచిన్ ఒకప్పటిలా బ్యాటింగ్ తో అలరించాడు. సచిన్.. సచిన్ నామజపంతో స్టేడియం మార్మోగింది. సచిన్ అందంగా షాట్లు కొడుతుంటే.. ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. 

(3 / 5)

ఇంగ్లండ్ మాస్టర్స్ తో మ్యాచ్ లోనూ సచిన్ సత్తాచాటాడు. ఆ పోరు లో 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. 

(4 / 5)

ఈ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో ఆరు జట్లు పోటీపడుతున్నాయి. ఇండియా మాస్టర్స్, శ్రీలంక మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్, దక్షిణాఫ్రికా మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్, ఇంగ్లండ్ మాస్టర్స్ తలపడుతున్నాయి. ఆయా జట్ల తరపున దిగ్గజ ప్లేయర్లు బరిలో దిగారు. 

(5 / 5)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు