TG Rythu Bharosa Updates : 'రైతు భరోసా' కోసం దరఖాస్తు చేశారా..? అయితే మీకో గుడ్ న్యూస్
- TG Rythu Bharosa Funds Updates : రైతు భరోసా స్కీమ్ పై మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. కొత్తగా పట్టాదార్ పాస్ బుక్ వచ్చి రైతు భరోసాకు దరఖాస్తు చేసుకున్న వారి బ్యాంక్ ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు. వివరాలు సరిగా ఉన్నవారి ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం నిధులను జమ చేయనున్నారు.
- TG Rythu Bharosa Funds Updates : రైతు భరోసా స్కీమ్ పై మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. కొత్తగా పట్టాదార్ పాస్ బుక్ వచ్చి రైతు భరోసాకు దరఖాస్తు చేసుకున్న వారి బ్యాంక్ ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు. వివరాలు సరిగా ఉన్నవారి ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం నిధులను జమ చేయనున్నారు.
(1 / 6)
తెలంగాణ రైతులకు వ్యవసాయశాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా పట్టాదారు పాస్ బుక్ వచ్చిన రైతుల ఖాతాల్లో కూడా పంట పెట్టుబడి సాయం నిధులను జమ చేస్తామని తెలిపింది. ఆ దిశగా ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంది.
(2 / 6)
ప్రస్తుతం అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. ఇప్పటికే మూడు ఎకరాలలోపు భూమి ఉన్న ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. మిగతా రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేయనున్నారు.
(3 / 6)
రైతు భరోసా స్కీమ్ కోసం గతంలో రైతుబంధు పొందిన రైతుల నుంచి ఎలాంటి దరఖాస్తులు తీసుకోలేదు. అయితే కొత్తగా పట్టాదార్ పాస్ బుక్ లు వచ్చిన రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దాదాపు మూడు లక్షలకుపైగా రైతులు కొత్తగా దరఖాస్తు చేసినట్లు తెలిసింది.
(image source unsplash)(4 / 6)
కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయా..? లేదా..? అన్న ఆందోళన పట్టాదారుల్లో నెలకొంది. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి ఖాతాల్లో కూడా డబ్బులను జమ చేస్తామని వ్యవసాయశాఖ తాజాగా తెలిపింది.
(image source .istockphoto.com)(5 / 6)
కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన మూడు లక్షల మంది బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఆయా బ్యాంకుల నుంచి క్లియరెన్స్ రాగానే… అర్హులైన వారిని గుర్తించి పంట పెట్టుబడి సాయం అందిస్తామని పేర్కొంది. ఈ దఫాలోనే ఇస్తామని తెలిపింది.
(6 / 6)
డీబీటీ పద్ధతిలో రైతుల ఖాతాల్లో ఈ డబ్బలు జమ అవుతాయి. రైతులు బ్యాంకులకు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఇక గతంలో రైతు బంధు వచ్చిన రైతులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ముందుగా ఎకరంలోపు ఉన్న రైతులకు పంట పెట్టుబడి సాయం అందించింది. తక్కువ విస్తీరణంలో ఉన్న భూముల నుంచి మొదలు చేసి ఎక్కువ విస్తీరణంలో ఉన్న భూములకు నిధులను విడుదల చేస్తున్నారు.
(image source unsplash.com)ఇతర గ్యాలరీలు