TG Rythu Bharosa Funds : ‘రైతు భరోసా’పై మరో అప్డేట్ - వారి అకౌంట్లలోకి కూడా డబ్బులు జమ
- TG Rythu Bharosa Scheme Updates : తెలంగాణ రైతులకు వ్యవసాయశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మూడు ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో కూడా రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు తెలిపింది. దీంతో రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం డబ్బులు జమ కానున్నాయి.
- TG Rythu Bharosa Scheme Updates : తెలంగాణ రైతులకు వ్యవసాయశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మూడు ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో కూడా రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు తెలిపింది. దీంతో రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం డబ్బులు జమ కానున్నాయి.
(1 / 7)
పంట పెట్టుబడి సాయానికి సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. ఇవాళ్టి నుంచి మూడు ఎకరాలలోపు భూమి గల రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రకటించింది.
(2 / 7)
తాజాగా వ్యవసాయ శాఖ చేసిన ప్రకటనతో మూడు ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లకి కూడా డబ్బులు జమ కానున్నాయి. ఇప్పటి వరకు గుంట నుంచి రెండెకరాల లోపు భూమి గల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.
(image source unsplash)(3 / 7)
ప్రభుత్వం ఇప్పటికే ఒక ఎకరం భూమి కలిగిన 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,126 కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండెకరాల భూముల గల రైతుల ఖాతాల్లో డబ్బులు వేసింది. మొత్తంగా రైతు భరోసా కింద రూ. 2218 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
(image source .istockphoto.com)(4 / 7)
ఇవాళ్టి నుంచి మూడు ఎకరాలు గల రైతుల ఖాతాల్లో డబ్బులు చేయనుంది. డీబీటీ పద్ధతిలో రైతుల ఖాతాల్లో ఈ డబ్బలు జమ అవుతాయి. రైతులు బ్యాంకులకు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఇక గతంలో రైతు బంధు వచ్చిన రైతులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
(image source unsplash.com)(5 / 7)
గతంలో పంట పెట్టుబడి సాయాన్ని రైతుబంధు పేరుతో అమలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని రైతు భరోసాగా మార్చారు. రూ. 10 వేల నుంచి రూ. 12 వేలకు కూడా పెంచారు. దీంతో ఎకరా చొప్పున ప్రతి రైతు ఖాతాలో రూ. 6వేలు జమ అవుతాయి. ప్రతి ఏడాదికి రైతు భరోసా కింద కింద రెండుసార్లు పంట పెట్టుబడి సాయం అందుతుంది.
(6 / 7)
రైతు భరోసా స్కీమ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 20 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఎకరాకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది.
(7 / 7)
గతంలో మాదిరిగానే ఈసారి కూడా ముందుగా ఎకరంలోపు ఉన్న రైతులకు పంట పెట్టుబడి సాయం అందించింది. గతంలోనూ గుంటల నుంచి మొదలుకొని అధిక విస్తీరణంలో ఉన్న భూములకు నిధులను జమ చేసేది. ప్రస్తుతం కూడా తక్కువ విస్తీరణంలో ఉన్న భూముల నుంచి మొదలు చేసి ఎక్కువ విస్తీరణంలో ఉన్న భూములకు నిధులను విడుదల చేస్తున్నారు.
(image source unsplash.com)ఇతర గ్యాలరీలు