Rythu Bandhu Scheme Updates : మిగిలిన రైతులకు పండగ తర్వాతే డబ్బులు - 'రైతుబంధు స్కీమ్' లేటెస్ట్ అప్డేట్ ఇదే
- Telangana Rythu Bandhu Scheme Updates: రైతుబంధు నిధుల జమకు సంబంధించి కీలక అప్డేట్ అందింది. ఇప్పటివరకు ఎకరంలోపు ఉన్నవారికే పెట్టుబడి సాయం అందగా… మిగతా వారు డబ్బుల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆయా రైతుల ఖాతాల్లో డబ్బుల జమ చేయటం పై సర్కార్ దృష్టిపెట్టింది.
- Telangana Rythu Bandhu Scheme Updates: రైతుబంధు నిధుల జమకు సంబంధించి కీలక అప్డేట్ అందింది. ఇప్పటివరకు ఎకరంలోపు ఉన్నవారికే పెట్టుబడి సాయం అందగా… మిగతా వారు డబ్బుల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆయా రైతుల ఖాతాల్లో డబ్బుల జమ చేయటం పై సర్కార్ దృష్టిపెట్టింది.
(1 / 5)
రైతుబంధు డబ్బుల కోసం తెలంగాణలోని రైతులు ఎదురుచూస్తున్నారు. డబ్బులు ఎప్పుడొస్తాయా అంటూ ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ కు సంబంధించి గతంలో ఉన్న స్కీమ్(రైతుబంధు) కు అనుగుణంగానే నిధులను జమ చేయాలని సర్కార్ నిర్ణయించటమే కాకుండా,.. ఇప్పటికే పలువురి ఖాతాల్లోకి డబ్బులను జమ చేసింది.(https://rythubandhu.telangana.gov.in/)
(2 / 5)
నిధుల జమకు సంబంధించి తాజాగా మంత్రి తమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. మంగళవారం నాటికి 30 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు వెల్లడించారు. (https://rythubandhu.telangana.gov.in/)
(3 / 5)
బుధవారం పాలేరులో మాట్లాడిన మంత్రి తుమ్మల.... మిగతా రైతులకు సంక్రాంతి తర్వాత పంట పెట్టుబడి సాయం నిధులు అందుతాయని చెప్పారు.(https://rythubandhu.telangana.gov.in/)
(4 / 5)
సంక్రాంతి తర్వాత ఎకరం కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమయ్యే అవకాశం ఉంది. (BRS Facebok)
(5 / 5)
కొత్తగా పాస్ బుక్ వచ్చిన రైతులకు సంబంధించి కూడా కీలక అప్డేట్ అందింది. పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తులను స్వీకరించగా… కొద్దిరోజుల క్రితం దరఖాస్తులను స్వీకరించకుండా సైట్ ను ఫ్రీజ్ చేసినట్లు తెలిసింది. అయితే ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా… పంట పెట్టుబడి సాయం కోసం దరఖాస్తులను స్వీకరించింది ప్రభుత్వం. వీటి ఆధారంగా కొత్త వారికి కూడా సాయం అందజేసే అవకాశం ఉంది.(CMO Twitter)
ఇతర గ్యాలరీలు