Rushikonda Palace : రుషికొండ ప్యాలెస్ రహస్యం వీడింది-రూ.500 కోట్ల వ్యయం, రూ.26 లక్షల బాత్ టబ్?- ఫొటోలు వైరల్!
- Rushikonda Palace : రుషికొండ భవన రహస్యం వీడిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇన్నాళ్లు రహస్యంగా నిర్మించిన రుషికొండ భవనాలను పరిశీలించామన్నారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, కూటమి నేతలు ఈ భవనాల సందర్శనకు వస్తే కేసులు పెట్టారన్నారు.
- Rushikonda Palace : రుషికొండ భవన రహస్యం వీడిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇన్నాళ్లు రహస్యంగా నిర్మించిన రుషికొండ భవనాలను పరిశీలించామన్నారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, కూటమి నేతలు ఈ భవనాల సందర్శనకు వస్తే కేసులు పెట్టారన్నారు.
(1 / 7)
విశాఖ రుషికొండపై గత ప్రభుత్వం హయాంలో క్యాంప్ కార్యాలయం నిర్మించారు. ఈ భవన నిర్మాణం వివాదాస్పదం అయ్యింది. రుషికొండను బొడిగుండులా కొట్టేసి భవనాలు కట్టారని గతంలో టీడీపీ ఆరోపించింది. ఇటీవల ఎన్నికల్లో అధికారం చేపట్టిన కూటమి పార్టీలు ఇవాళ రుషికొండపై భవనాలను సందర్శించాయి.
(2 / 7)
వైసీపీ ప్రభుత్వ సమయంలో ఈ భవనాలను చూసేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ భవనాలను సీఎం క్యాంప్ ఆఫీసుగా ఉపయోగించాలని గత ప్రభుత్వం భావించింది. అయితే ప్రభుత్వం మారడంతో ఇన్నాళ్లు ఎవరినీ అనుమతించకుండా.. ఏం నిర్మించారో బయటపెడతామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు రుషికొండ భవానాలను సందర్శనకు వెళ్లారు.
(3 / 7)
స్థానిక నాయకులతో కలిసి రుషికొండ భవనంలోకి వెళ్లామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ భవనంలో ఖరీదైన ఇంటీరియర్స్, ఫర్నీచర్ సుమారు రూ. 500 కోట్లతో నిర్మాణం చేపట్టారన్నారు. సీఎం క్యాంప్ ఆఫీసుగా ఉపయోగిస్తారని గత ప్రభుత్వ హయాంలో ప్రచారం చేశారన్నారు.
(4 / 7)
రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఉందని టీడీపీ ట్వీట్ చేసింది. రుషికొండ భవన రహస్యం వీడిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇన్నాళ్లు రహస్యంగా నిర్మించిన రుషికొండ భవనాలను పరిశీలించామన్నారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, కూటమి నేతలు ఈ భవనాల సందర్శనకు వస్తే కేసులు పెట్టారన్నారు.
(5 / 7)
రుషికొండ భవనం నిర్మాణ అంచనాలను రహస్యంగా ఉంచారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రభుత్వ భవనమైన ప్రజావేదికను అనుమతులు లేవని గత జగన్ ప్రభుత్వం సర్కార్ కూల్చివేసిందన్నారు. రుషికొండపై ఏ అనుమతులతో ఈ భవనాలు కట్టారన్నారు. ఎవరినీ అనుమతించకుండా గత ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ ఈ భవనాలు ప్రారంభించిందన్నారు. అసలు ఇంత విలాసవంతమైన భవనాలు ఎందుకని ప్రశ్నించారు.
(6 / 7)
రుషికొండపై 61 ఎకరాల్లో మొత్తం ఏడు బ్లాకులు నిర్మించారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. వీటిని ఏం చేయాలో సీఎం చంద్రబాబును అడిగి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇతర గ్యాలరీలు