(1 / 5)
ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటోన్న టీవీ స్టార్స్‌లో రూపాలీ గంగూలీ నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. అనుపమ సీరియల్ కోసం ఈ నటి ఒక్కో ఎపిసోడ్ కోసం లక్షన్నర నుంచి మూడు లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది.
(2 / 5)
హిందీలో హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకుంటోన్న ఇషితా ఇన్ ఏ హై మొహబ్బతేన్ సీరియల్ కోసం దివ్యాంక త్రిపాఠి ఒక్కో ఎపిసోడ్ కోసం లక్ష నుంచి లక్ష ఇరవై వేల వరకు రెమ్యునరేషన్ సొంతం చేసుకుంటున్నట్లు సమాచారం.
(3 / 5)
నాగిన్ 6 సీరియల్‌లో లీడ్ రోల్ లో తన నటనతో బుల్లితెర ప్రేక్షకులకు ఆకట్టుకుంటోంది తేజస్వి ప్రకాష్. ఈ సీరియల్‌లో ఒక్కో ఎపిసోడ్ కోసం రెండు లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
(4 / 5)
అనుపమ సీరియల్‌లో అనూజ్ పాత్రతో గౌరవ్ ఖన్నా పాపులర్ అయ్యాడు. ఈ సీరియల్ కోసం అతడు ఒక్కో ఎపిసోడ్ కోసం లక్షన్నర వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
(5 / 5)
కుందాళి భాగ్య సీరియల్ ఫేమ్ శ్రీతి ఝా తాను నటించే సీరియల్స్ విషయంలో ఒక్కో ఎపిసోడ్‌కు లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టీవీ వర్గాలు చెబుతోన్నాయి.
ఇతర గ్యాలరీలు